రాజస్థాన్ రాష్ట్రంలో కొందరు పోలీసులు కన్న కొడుకు కళ్లముందే తండ్రిని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబందించిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ లోని జైసింగ్‌పురా ప్రాంతంలోని భంకత్రోటాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇక అందిన వివరాల ప్రకారం.. పోలీసులు కొట్టిన వ్యక్తిని 35 ఏళ్ల చిరంజిలాల్ గా గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. Also read:…
ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు.. తల్లి ఇచ్చే ప్రేమను, ఆప్యాయతను ప్రపంచంలో ఏదీ ఇవ్వదు. దీనికి సంబంధించిన సంగ్రహావలోకనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ తల్లి రోడ్డు పక్కన కూర్చుని ఉంది. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తల్లి ఎప్పటికీ పేదది, ధనికురాలు కాదని అంటున్నారు.
మద్యం తాగొద్దని చెప్పినందుకు తన కుమారుడిని దుండగులు హత్య చేశారని ఓ తల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. జహంగీర్‌పురిలో దుండగులు 19 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. మద్యం తాగవద్దని యువకుడి తల్లి కొందరు అగంతకులకు చెప్పింది. దీంతో.. కోపోద్రిక్తులైన దుండగులు ఆమె కొడుకును చంపేశారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొడుకుపై తండ్రి కత్తితో దాడి చేసిన సంఘటన శివపురిలోని జవహర్ కాలనీలో జరిగింది. తాను చెప్పిన మాట విననందుకు కన్న కొడుకుపై కర్కశం చూపించాడు. కూలర్ ను శుభ్రం చేయమని చెప్పిన తండ్రి.. కుమారుడు మాట వినకపోవడంతో కోపంతో కర్రలతో కొట్టాడు. అంతటితో ఆగకుండా.. తండ్రి కొడుకుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన తన కొడుకును రక్షించబోయిన తల్లిని, మరో కుమారుడిని కూడా చితక బాదాడు.
క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్. ఈయన క్రికెట్ ఆడే సమయంలో టీమిండియా వాల్ అని పిలిచేవారు. ఇకపోతే.. ద్రవిడ్ తన కోచింగ్ లో టీమిండియాను పటిష్టంగా చేశాడు. మొత్తానికి అటు క్రికెట్ లోనూ, ఇటు కోచింగ్ లోనూ బాగా రాణిస్తున్నాడు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ కొడుకు కూడా ఓ క్రికెటర్ అన్న విషయం అందరికీ తెలియదు. అంతేకాకుండా.. అతను ఆడే…
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ రెండో బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా.. తన కుమారుడికి 'అయాయ్' అని నామకరణం చేశారని తెలిపారు. ఇంతకుముందు కోహ్లీ, అనుష్క దంపతులకు మొదటి సంతానంలో కూతురు వామిక జన్మనిచ్చింది.