తల్లులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లను ఎలా పెంచాలీ... వాళ్లకోసం ఏం చేయాలీ... ఇలా ఎన్నో ఆలోచిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు వేసే బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతుంటారు. బిడ్డకు చిన్న కష్టమొస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది.
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువ రైతు మహేశ్వర్ రెడ్డి(48), ప్రశాంతి(35) అనే దంపతులు అప్పుల బాధ తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు రూ.2.5 కోట్లు దాకా అప్పు చేశారు. సదరు దంపతులకు నిఖిల్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు.
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడి కోసం వస్తే.. ప్రియురాలిపై యువకుడి తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతకు ముందు.. ప్రియుడు, ప్రియురాలు వీరి పెళ్లి కోసం నకిలీ పత్రాలు తయారు చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు ఆమెను ఇంటికి తీసుకురాగా.. తండ్రీకొడుకులు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. అయితే.. ఆ ఇద్దరి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తండ్రీకొడుకులపై…
కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండంటూ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు ఓ సీఐ తల్లిదండ్రులు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూల మలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ, ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీరు చంద్రయాన్ గుట్ట వాసులుగా గుర్తించారు. వీరిలో హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12) సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు సానికులు తెలిపారు. రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
కరిచింది పెంపుడు కుక్కే కదా అని చేసిన నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. కుక్కకు రాబిస్ సోకిన విషయం తెలుసుకోకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆలస్యం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యువకుడు. ఈ విషాదం విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. తండ్రి నర్సింగరావు ఆర్టీసీలో కండక్టర్ గా పని చేసి గత ఎనిమిదేళ్లుగా పెరాలిసిస్ వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. కుమారుడు భార్గవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహానికి ఆశీస్సులు పొందేందుకు ఆలయానికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాధిక మర్చంట్తో అనంత్ అంబానీ వివాహం జూలై 12న జరుగనుంది. ఈ సమయంలో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భారత్తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. తన కొడుకు, కాబోయే కోడలు కోసం బాబా…
మహారాష్ట్రలోని థానే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యపై కోపంతో తొమ్మిదేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నోట్లో కాగితాలు కుక్కి మరి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన థానే జిల్లా సహపూర్ తాలూకా పరిధిలోని కసర ప్రాంతంలోని వశాల వద్ద సోమవారం అర్థరాత్రి రాత్రి జరిగింది. ఘటన జరిగిన సమయంలో 59 ఏళ్ల నిందితుడు మద్యం…