Boy Died: లావుగా ఉన్నాడని కొడుకుని బలవంతంగా ట్రెడ్‌మిల్ చేపించిన తండ్రి.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ తండ్రి విపరీతమైన చర్యల వల్ల అతని 6 ఏళ్ల కొడుకును మృత్యువు కారకుడయ్యాడు. ఆ వ్యక్తి, తన రెండవ కొడుకు లావుగా ఉన్నాడని, ట్రెడ్‌మిల్ పై పరుగెత్తాలని ఆదేశించాడు. ఆ కుర్రాడి వయసును పట్టించుకోకుండా ట్రెడ్ మిల్ స్పీడ్ ను విపరీతంగా పెంచాడు. దీంతో ఆ బాలుడు కొన్ని రోజుల తర్వాత శరీరంలో లోపల జరిగిన డామేజ్ ను గమనించకపోవడంతో గాయాలపాలై మృతి చెందాడు. క్రైమ్ సీన్ విచారణలో అమెరికాలో మూడేళ్ల క్రితం జరిగిన దారుణ ఘటన వెలుగు చూసింది. న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్ గ్రెగర్ తన కొడుకు మరణానికి 2021లో అరెస్టయ్యాడు. ఈ కేసులో ఇటీవల జరిగిన విచారణలో బాలుడిని చంపిన ట్రెడ్‌మిల్ రన్ ఫుటేజీని సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. అదే సంవత్సరం మార్చి 20న, క్రిస్టోఫర్ తన కొడుకు కోరీతో కలిసి స్థానిక ఫిట్‌నెస్ సెంటర్ కి వెళ్లాడు.
Also read: Tumour Removed: 16.7 కిలోల బరువున్న భారీ కణితిని తొలిగించిన వైద్యులు..
Also Read
అబ్బాయి లావుగా ఉన్నందున ట్రెడ్‌మిల్‌పై పరిగెతించాడు. అది ఆ చిన్న అబ్బాయికి కష్టమైనప్పటికీ, అతను తన వేగాన్ని గణనీయంగా పెంచాడు. దీంతో బాలుడు పలుమార్లు కిందపడిపోయాడు. అయినా తండ్రి ఏమాత్రం వెనుకాడకుండా కొడుకును బలవంతంగా ట్రెడ్‌మిల్ పై ఎక్కించాడు. నో చెబితే కొట్టేస్తా అన్నట్లుగా అందులో అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత 2021 ఏప్రిల్ 1న బాలుడి తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడుని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు నిజం వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Also read: David Warner Pushpa 2: నాకు మళ్లీ పని పడింది.. దీన్ని నేర్చుకోవాలంటున్న డేవిడ్ భాయ్..
మరుసటి రోజు బాలుడు మరణించాడు. స్కానింగ్ లో అతడికి శరీరం అంతర్గతంగా తీవ్ర గాయాలైనట్లు తేలింది. గుండె. కాలేయం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ సమస్యలతో అబ్బాయి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అదే ఏడాది జూలైలో క్రిస్టోఫర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ఇందుకు సంబంధించి దృశ్యలు చూసి బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ కేసులో అతను జీవిత ఖైదు అనుభవించే అవకాశం లేకపోలేదు.
NEW: Mother breaks down in court as she watches her son’s father abuse her child by making him run on the treadmill because he was “too fat.”
New Jersey father Christopher Gregor is accused of killing his 6-year-old son Corey Micciolo.
New footage shows the boy repeatedly face… pic.twitter.com/aVKknkOGd5
— Collin Rugg (@CollinRugg) May 1, 2024
- Tags
- father
- in gym
- social media
- son
- son died
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!