తండ్రి మద్యానికి బానిస కావడంతో ఈ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడింది. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన మానుకోలేదు. తండ్రితో ఎలాగైనా మద్యాన్ని మాన్పించాలని 13 ఏళ్ల కుమారుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే ప్లాన్ ను సిద్ధం చేసుకున్నాడు. తన తండ్రి మద్యానికి బానిస అయ్యాడని, తన కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోందని, తన, తన సోదరి చదువుకు ఇది విఘాతంగా మారిందని గ్రామ సభలోని పెద్దలకు ఫిర్యారు చేశాడు. తన సోదరిని ఎలాగైనా డాక్టర్‌ను చేయాలని అనుకుంటున్నానని,…
శ్రీకాకుళం, ఆమదాలవలస (మం) బొబ్బిలిపేటలో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. కర్ఫ్యూ కారణంగా తండ్రి అంతిమ చూపుకు నోచుకోలేదు ఓ కొడుకు. కరోనాతో ఆవాల అప్పయ్య (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. అయితే ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారు మృతుడి కొడుకు, ఇద్దరు కుమార్తెలు. కానీ కర్ఫ్యూ కారణంగా ఊరికి రాలేకపోతున్నామంటూ బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పయ్య మృతదేహాన్ని ముట్టుకునేందుకు స్థానికులు సాహసించలేదు. దాంతో రెడ్ క్రాస్ సొసైటీకి సమాచారం అందించారు సచివాలయ సిబ్బంది.…