మరోవైపు కామన్వెల్త్ యూత్ గేమ్స్ వేడుకల్లో సినీ నటుడు ఆర్.మాధవన్ కుమారుడు వేదాంత్ మెరిశాడు. ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వేదాంత్.. ఇండియాకు సపోర్ట్ చేస్తూ భారతదేశ పతకాన్ని పట్టుకుని గ్రౌండ్ చుట్టూ తిరిగాడు. అయితే ఆ వేడుకల్లో పాల్గొన్న వేదాంత్ వీడియోను.. తన తండ్రి ఆర్.మాధవన్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ తండాలో నివాసం ఉంటున్న బీమ్లా అనే వ్యక్తి ఆందోల్ మండలం అన్నాసాగర్ దగ్గర రోడ్ ప్రమాదం జరగడంతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన బీమ్లా తండ్రి తట్టుకోలేక పోయారు, చేతికొచ్చిన కొడుకు తన కళ్ళముందే నిర్జీవంగా పడి ఉండటంతో చూసి జీర్ణించుకోలేని బీమ్లా తండ్రి ధర్మా నాయక్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయారు.
బెల్జియంలో 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తల్లి శరీరాన్ని ముక్కలుగా నరికి భాగాలను ఫ్రిడ్జిలో పెట్టి ఓ కాలువలో పడేశాడు. గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఈ హత్య గురించి చెప్పాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ దారుణ ఘటన చోటు చోటుచేసుకుంది. తన ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిని యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. కొడుకుకి, తల్లికి మధ్య గొడవ జరుగుతుండగా.. దాన్ని పరిష్కరించేందుకు వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన కన్న తల్లిని ఓ తాగుబోతు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని పొట్టుపొట్టుకొట్టాడు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్న తల్లినే నడి రోడ్డుపై జుట్టు పట్టి లాగి ఓ యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఇవాళ (బుధవారం) జరిగింది. అయితే.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మమ్మ భర్త కోల్పోయి ఓ హోటల్ లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది.
కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి తన కులం నుంచి మరొక కులానికి మారాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలన్న తపనతో.. తన ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ముస్లిం నుంచి హిందువుగా మారాడు.
ఈ రోజుల్లో చాలా మంది తమ బిజీ లైఫ్స్టైల్ కారణంగా వారి తల్లిదండ్రులకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో సమయం లేకపోవడం వల్ల, సంబంధం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. తల్లితండ్రులకు మనపై కోపం వచ్చినా, మనపై వారి ప్రేమ ఎప్పుడూ తగ్గదు.