Son Killed Father: డ్రగ్స్ కు బాలిసగా మారిన కన్న కొడుకును మందలించిన తండ్రిని దారుణంగా చంపిన ఘటన ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో కలకలంగా మారింది. కొడుకు మారుతాడని సొంత ఊరినే వదిలేసి వచ్చిన తీరు మారకపోవడంతో.. తండ్రిని బండరాయితో మోది, పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో చోటుచేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అదుపులో తీసుకున్నారు.
Read also: Viral Video: ఇదేంది భయ్యా.. చిప్స్ ప్యాకెట్స్ అంటే ఇష్టమని.. మరి ఇంతలా కార్ డెకరేషనా..?!
హైదరాబాద్ లోని తుర్కయాంజాల్ లో రవీందర్ కుటుంబం ఆరెంజ్ అవెన్యూలో కాలనీలో నివాసం ఉంటుంది. భార్య సుధ, అనురాగ్ తో ఉంటున్నాడు. రవీందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. కొడుకు అనురాగ్ యానిమేషన్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా అనురాగ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ కు బానిస అయ్యాడు. తిరుపతి అనురాగ్మ విలాసాల కోసం ఇంట్లో డబ్బులు తీసుకుని, కుటుంబ సభ్యులతో రోజూ ఏదో ఒక గొడవ చేస్తుండటంతో తల్లిదండ్రులు మందలించారు. అయినా అనురాగ్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో గంజాయి మహమ్మారి నుండి అతనికి విముక్తి కల్పించేందుకు రిహాబిటేషన్ సెంటర్లో చేర్పించిన తండ్రి. కొద్ది రోజులుగా అనురాగ్ రిహాబిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు.
Read also: RBI Repo Rate: ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథం.. వరుసగా ఇది ఏడోసారి!
ఆ తర్వాత రిహాబిటేషన్ సెంటర్ నుండి బయటికి వచ్చాడు. అయితే.. నాగర్ కర్నూల్ కొల్లాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ కుటుంబం.. కొడుకు కోసం రెండు నెలల క్రితమే తుర్కయాంజాల్ లో ఇల్లు కొనుగోలు చేసి అనురాగ్ కుటుంబం అక్కడికి వచ్చింది. గంజాయి విషయంలో గురువారం సాయంత్రం అనురాగ్ అతని తండ్రి రవీందర్ల మధ్య గొడవ జరిగింది. గంజాయిని మానేయాలని మత్తుకు బానిస కావద్దని అనురాగ్‌కు తండ్రి రవీందర్ చెప్పాడు. అయితే.. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న అనురాగ్ తండ్రితో వాగ్వివాదానికి దిగాడు. మత్తులో కోపంతో తండ్రి పై అనురాగ్ దాడికి పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా తండ్రి కొడుకులకు మధ్య వాగ్వివాదం కొనసాగుతుంది. దీంతో తన ఎంజాయ్మెంట్ కి అడ్డుగా వస్తున్నాడని తండ్రిని అనురాగ్ చంపాలనుకున్నాడు. గురువారం సాయంత్రం గొడవ జరుగుతున్న సందర్భంలో అప్పటికే తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలు తండ్రి పై పోశాడు. దీంతో భయంతో వెంటనే ఇంట్లోంచి అనురాగ్ తండ్రి రవీందర్ బయటికి పరుగులు పెట్టాడు.
Read also: Warangal Market: ఏనుమాముల మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు.. ఆందోళనలో రైతులు..
అనురాగ్, తండ్రి వెంటపడి నిప్పంటించడంతో రవీందర్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. శరీరం కాలుతూ కేకలు వేస్తున్న తండ్రిపై విచక్షణా రహితం అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదాడు. అది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి హుటా హుటిన చేరుకున్న పోలీసులు గంజాయి మత్తులో ఉన్న అనురాగ్ ను అదుపులో తీసుకున్నారు. అయితే.. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో అనురాగ్ ను విచారిస్తున్నారు పోలీసులు. అనురాగ్ కు డ్రగ్స్ ఎక్కడినుండి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం స్థానికులకు భయాందోళన కలిగిస్తున్నాయి. గంజాయి ఇతర మత్తుపదార్థాలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వెయ్యాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Breaking: ప్రముఖ తెలుగు మాజీ న్యూస్ రీడర్ ‘శాంతి స్వరూప్’ మృతి..!