BJP: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు సిద్ధార్థ నాథ్ సింగ్, అరుణ్ సింగ్ హాజరయ్యారు. ఇక, తాజాగా బీజేపీ సీటు దక్కించుకున్న ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.. అయితే, బీజీపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చగా మారింది.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా ఈ కీలక సమావేశానికి దూరంగా ఉన్నారు.. ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగ పడ్డారు ఈ పడిన నలుగురు నేతలు. అయితే, ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని సత్యకుమార్‌ను, అనపర్తి నుంచి బరిలోకి దిగాలని సోము వీర్రాజు ముందు ప్రతిపాదనలు పెట్టింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. కానీ, అనపర్తి నుంచి పోటీ చేయడడానికి సోము వీర్రాజు విముఖత చూపిస్తున్నారట.. మరోవైపు.. జ్వరం కారణంగానే ఈ రోజు సోము వీర్రాజు సమావేశానికి హాజరు కాలేదంటున్నారు బీజేపీ నేతలు.. కానీ, ముఖ్య నేతల గైర్హాజరుపై బీజీపీ నేతల్లో చర్చ మాత్రం నడుస్తోంది..
Read Also: MK Stalin: దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ అధికారంలోకి రావొద్దు..
కాగా, ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ఈ రోజు సమావేశంలో అసెంబ్లీ అభ్యర్ధులను ఖరారు చేయనుంది.. బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలపై కొంత క్లారిటీ వచ్చింది.. విజయవాడ-వెస్ట్, బద్వేల్, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్, ఆదోని, పాడేరు, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. అనపర్తి అసెంబ్లీ స్థానానికి బదులుగా రాజమండ్రి అసెంబ్లీ స్థానాలను కూడా కోరుతున్నారు బీజేపీ నేతలు. అదనంగా రాజంపేట అసెంబ్లీ స్థానం కూడా బీజేపీ నేతలు కోరే అవకాశం ఉందట.. రాజంపేట లోక్‌సభ పరిధిలో మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి సుమారు లక్ష ఓట్లు ఉన్నాయి. క్షత్రియ సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయాలంటే రాజులకే (క్షత్రియులు) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.. టీడీపీ నుంచి అయితే జగన్మోహన్ రాజు, బీజేపీ అయితే చెంగల్ రాజు కు టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు.. ఇక, రాజమండ్రి-రూరల్ అసెంబ్లీ స్థానం లేదా రాజమండ్రి-అర్బన్ స్థానం నుంచి బీజేపీ పోటీచేయాలని ప్రతిపాదన ఉందట.. తద్వారా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించాలని బీజేపీ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు జరిగే కీలక సమావేశంలో పోటీ చేసే స్థానాలతో పాటు.. అభ్యర్థులపై క్లారిటీకి వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కానీ, ఈ రోజు భేటీకి కీలక నేతలు డుమ్మా కొట్టడం మాత్రం చర్చగామారింది.