రాజమండ్రిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కమలం పార్టీలో చేరుతున్నారన్న ప్రతిపాదన గాని ఆలోచన గాని లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరినట్లు తెలిసింది.. ఒకరు ఈ పార్టీలో చేరాలి మరో పార్టీలో చేరకూడదు అనే నిబంధన ఏదీ లేదు అని ఆయన తేల్చి చెప్పారు. ఎవరు ఏ పార్టీలోనైనా చేరవచ్చు.. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం కావాలి, ప్రజాపక్షంగా కూడా వ్యవహరించవచ్చు అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
Read Also: Minister Nadendla Manohar: జాయింట్ కలెక్టర్పై మంత్రి నాదెండ్ల సీరియస్
ఇక, ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించాలి.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా హుందతనంగా వ్యవహరించాలి అని సూచించారు. అలాగే, కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీలో అహంకార ధోరణి మారట్లేదు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఎమర్జెన్సీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే తీరు కనబరుస్తుంది.. ప్రస్తుత పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఇదే ధోరణితో వ్యవహరిస్తుంది అన్నారు. కాగా, ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలి అని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.