ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరాల జల్లులు కురిపించారన్న ఆయన.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యిందని కేంద్ర మంత్రి ప్రకటించారని గుర్తుచేశారు.. ఇక, కోనసీమ రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోందని ప్రకటించిన ఆయన.. అదేవిధంగా కడప-బెంగుళూరుకు రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం షేర్ జమ చేయకపోవడంతో పనులు ఆగిపోతాయని ఆరోపించారు.. కడప-బెంగుళూరు రైల్వే లైన్ స్టేట్ షేర్ కట్టించేవిధంగా ఉద్యమిస్తామని వెల్లడించిన సోము వీర్రాజు.. ఆంధ్రప్రదేశ్ రైల్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందన్నారు.
Read Also: UP: 2వ టర్మ్‌లో యోగి కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయం, 15 కోట్ల మందికి లబ్ధి..