Somu Veerraju: జగన్‌ది దశ, దిశలేని ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జగన్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు అస్త్రాలు ఎక్కుపెడుతూనే వున్నారు. ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమే. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారు.
వలంటీర్ వ్యవస్థతో ప్రజాస్వామ్య వ్యవస్థను సీఎం నాశనం చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా అమలవుతున్న శక్తి కేంద్రం. మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలి. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించి జగన్ కూడా తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. 14, 15వ ఆర్దిక సంఘం నుంచి గ్రామాల అభివృద్ధికి మోడీ నిధులు కేటాయించారు.
Also Read
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
సర్పంచుల ఆధారంగా నిధులు ఇస్తున్న శక్తి నరేంద్ర మోడీ. ప్రజలకు ఇచ్చే రూ. 1 కిలో బియ్యం ఖర్చు కేంద్రానిదే. ఇంకా మధ్యాహ్న భోజన పధకం, స్కూల్ యూనిఫాం, పాఠశాలలు అభివృద్ధికి మోడీ నిధులిచ్చారు. జగన్ నవరత్నాలిస్తే… మోడీ డజన్ల కొద్దీ రత్నాలు ఇచ్చారు. జగన్ పధకాలకు అప్పులు చేసి.. అప్పులు పుట్టని పరిస్థితికి వచ్చారు. మూడు వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేస్తామని కేంద్రం చెప్పింది. రైల్వేకు రూ. 64 వేల కోట్లు కేటాయించారు. జగన్ మాత్రం కాగ్ రిపోర్టులకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. బీజేపీకి ఓట్లు పడవన్న మంత్రి వెల్లంపల్లి చర్చకు రావాలి.
ఎవరు ఎన్నెన్ని నిధులిచ్చారో బహిరంగంగా చర్చిద్దాం. మోడీకి ఓటేయాలని వెల్లంపల్లితోనే చెప్పిస్తాం. ఏపీలో బీజేపీ రాజకీయం చేయడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తే బీజేపీ నిలదీస్తుందన్నారు. రాజధానిని కట్టలేని చేతకాని ప్రభుత్వం. అమరావతిని చంపేద్దామని కుట్రలు చేస్తున్నారు. మీరు కేపిటల్ కట్టకున్నా.. బీజేపీ రహదారుల అభివృద్ధి, మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేశాం. యూనివర్శిటీలు, ఆసుపత్రులు కట్టి విద్యార్ధులకు, పేదలకు సేవలు అందించాం. అమరావతి నుంచి అనంతపురం వరకు రూ. 10 వేల కోట్లతో ఎక్స్ ప్రెస్ రహదారిని నిర్మిస్తున్నాం.
రాజకీయ నాయకుల్లారా మాయ మాటలు, కాకమ్మ కబుర్లు మానేయండి. బీదేపీ మంత్రం అభివృద్ధి.. నాలుగు రాష్ట్రాల్లో అదే మా గెలుపు తంత్రం. ఏపీకి చంద్రబాబు హయాంలో రూ. 35 వేల కోట్లు, వైసీపీ హయాంలో రూ. 36 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. నరేగా కింద నిధులు ఇచ్చే కేంద్రం పోలవరం నిర్మాణానికి ఎందుకు ఇవ్వం. ఇక నుంచి బీజేపీపై కూతలు, కోతలు కూయలేరు. శక్తి కేంద్రం ద్వారా ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేలా అందరూ అడుగులు వేయాలన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?