Smriti Mandhana: రికార్డు బ్రేక్.. ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా స్మృతి
- ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన
- 4 సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డ్
- భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన మరోమారు సెంచరీతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్స్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదురుకొని భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అన్నాబెల్ సదర్లాండ్ సెంచరీ కారణంగా ఆరు వికెట్లకు 298 పరుగులు చేసింది. మరోవైపు, అరుంధతి రెడ్డి భారత్ తరఫున అద్భుతంగా రాణించి 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మొదట్లో 78 పరుగులకే తొలి 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సదర్లాండ్ 95 బంతుల్లో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించింది.
Also Read: AUS W vs IND W: స్మృతి మందాన సెంచరీ చేసినా.. భారీ తేడాతో ఓడిన భారత్
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఇక భారీ లక్ష్య ఛేదనలో ప్రతిగా స్మృతి మంధాన జట్టుకు శుభారంభం అందించి ఏడాదిలో నాలుగో సెంచరీ సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 103 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. ఈ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. అయితే, సెంచరీ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక 105 పరుగులు చేసి ఔటైంది. ఇకపోతే, 2024లో ఆమెకు నాలుగో వన్డే సెంచరీ. దీంతో మహిళా క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రీడాకారిణిగా కూడా స్మృతి మంధాన నిలిచింది. మహిళల వన్డే క్రికెట్‌లో 7 మంది క్రీడాకారిణులు ఏడాది వ్యవధిలో అత్యధికంగా 3 సెంచరీలు మాత్రమే సాధించారు. కానీ, స్మృతి మంధాన 4 సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గా రికార్డ్ సృష్టించింది.
ఈ ఇన్నింగ్స్‌తో స్మృతి మంధాన తన వన్డే కెరీర్‌లో 9 సెంచరీలు పూర్తి చేసుకుంది. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా స్మృతినే. మరోవైపు, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. స్మృతి మంధానతో పాటు నాట్ స్కివర్ బ్రంట్, షార్లెట్ ఎడ్వర్డ్స్, చమరి అటపట్టు కూడా వన్డే క్రికెట్‌లో 9 సెంచరీలు చేశారు. అదే సమయంలో, మెగ్ లానింగ్ 15 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ కు చెందిన సుజీ బేట్స్ 13 సెంచరీలతో, ఇంగ్లాండ్ కు చెందిన టామీ బ్యూమాంట్ 10 సెంచరీలతో.. వరుసగా రెండు మూడు స్థానాలలో ఉన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!