వడోదరలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత బౌలర్ దీప్తి శర్మ ఆరు వికెట్లతో చెలరేగింది. తన కోటా 10 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ పడగొట్టింది. దీప్తితో పాటు రేణుకా ఠాకూర్ (4/29) కూడా చెలరేగడంతో విండీస్ కుదేలైంది. భారత బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ 38.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో చినెల్లె హెన్రీ (61) హాఫ్ సెంచరీ చేయగా.. క్యాంప్‌బెల్లె (46), అలియా అలెన్ (21) రాణించారు. క్వియానా జోసెఫ్ (0), హీలే మాథ్యూస్ (0), డియాండ్రా డాటిన్ (5), జైదా జేమ్స్ (1) విఫలమవడం జట్టుపై ప్రభావం పడింది.
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. పీకల్లోతు కష్టాల్లో భారత్!
163 పరుగుల స్వల్ప టార్గెట్‌లో భారత మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన నాలుగు పరుగులకే పెవిలియన్ చేరింది. 19 బంతుల్లో ఒక ఫోర్ బాది క్యాచ్ అవుట్ అయింది. కాసేపటికే హర్లీన్ డియోల్ (1) కూడా నిరాశపరిచింది. ఈ సమయంలో ప్రతీకా రావల్ (18), హర్మన్‌ప్రీత్ కౌర్ (32) జట్టును ఆదుకున్నారు. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు అవుట్ అయ్యారు. క్రీజులో జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు ఉన్నారు. భారత్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 74 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 89 పరుగులు అవసరం. ఇప్పటికే వన్డే సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
1⃣0⃣Overs
3⃣ Maidens
3⃣1⃣ Runs
6⃣ WicketsThat was one impressive performance from Deepti Sharma! 🙌 🙌
Drop an emoji in the comments below to describe that display 🔽
Updates ▶️ https://t.co/SKsWib5uuE#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/nvaIr8Pjfi
— BCCI Women (@BCCIWomen) December 27, 2024