రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. కేవలం 70 బంతుల్లోనే 100 పరుగులు సాధించి.. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. అంతేకాకుండా.. మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాల్గవ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. ఇదే కాకుండా.. వన్డే క్రికెట్ లో 500+ బౌండరీలు బాదిన రెండో భారత మహిళా బ్యాటర్ గా రికార్డ్ సృష్టించింది.
Read Also: Police Notice to Manchu Manoj: మంచు మనోజ్‌కు పోలీసుల నోటీసులు..! ఇక్కడి రావొద్దు..!
మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రీడాకారిణిగా మెగ్ లానింగ్ రికార్డు సృష్టించింది. ఆమె 15 సెంచరీలు చేసింది.. సుజీ బేట్స్ 13 సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా, టామీ-మంధాన 10 సెంచరీలతో ఉన్నారు. బుధవారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో స్మృతి మంధాన 80 బంతుల్లో 135 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. స్మృతి మంధాన, ప్రతీకా రావల్‌ల మధ్య తొలి వికెట్‌కు రికార్డు బ్రేకింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 233 పరుగులు చేశారు. ఇది భారత మహిళల జట్టులో ఏ వికెట్‌కైనా మూడో అత్యధిక భాగస్వామ్యం.
స్మృతి మంధాన 2024 వన్డేల్లో 16 ఇన్నింగ్స్‌ల్లో 62.25 సగటుతో 996 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె నాలుగు అర్ధ సెంచరీలు, 5 సెంచరీలు సాధించింది. అందులో 123 ఫోర్లు, 16 సిక్సర్లు బాదింది. గతంలో హర్మన్‌ప్రీత్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును మంధాన బద్దలు కొట్టింది. గతేడాది బెంగళూరులో దక్షిణాఫ్రికాపై హర్మన్‌ప్రీత్ 87 బంతుల్లో సెంచరీ చేసింది.