గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. కాగా, బ్యాంకులు ఈ విచారణలకి తగిన సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది.. 229, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహిస్తున్నారు.
ఏపీ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రుణాలు అందించి వారికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల 10వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనున్నది. 229, 230 వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత ఏడాది అక్టోబరు 17 తేదీన ఎస్ఎల్ బీసీ సమావేశం జరిగింది. ఎల్లుండి జరగబోయే సమావేశంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్…
Minister Atchannaidu: అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‍లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
CM YS Jagan: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన 222వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది.. గత ఏడాది ఎంతమేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నది వెల్లడించింది ఎస్‌ఎల్బీసీ. ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపుగా ఇచ్చామనీ, మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువరుణాలు ఇచ్చామని పేర్కొంది. ప్రాథమిక రంగానికి 2022–23 రుణప్రణాళిక లక్ష్యం రూ. 2,35,680 కోట్లు.. ఇచ్చిన రుణాలు రూ. 2,34,442 కోట్లు.. 99.47శాతం లక్ష్యాన్ని…
Buggana Rajendranath: ఏపీలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో వివిధ బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (SLBC) 220వ సమావేశం మంత్రి బుగ్గన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక(ఏసీపీ)అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి, వివిధ ఇండికేటర్ల…
అమరావతిలో 219వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్‌బీసీ వెల్లడించింది. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించినట్లు ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. కాగా 2021-22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్…