CM Chandrababu: ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. ఆహార అలవాట్లు మారాయి.. అగ్రికల్చర్ స్థానంలో హార్టికర్చల్ వచ్చేస్తోంది అని పేర్కొన్నారు. హార్టికల్చర్ సాగుకు, ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకులు మద్దతుగా నిలవాలి అని చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదు.. దీని కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్ఎఈలకు రుణాలను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసింది.. దానికి బ్యాంకులు సహకరించాలి అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Speaker Ayyanna Patrudu: ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు..!
ఇక, గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. కాగా, బ్యాంకులు ఈ విచారణలకి తగిన సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు. పీఎం సూర్యా ఘర్ పథకం కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు.