SLBC Meeting: రేపు బ్యాంకర్ల కమిటీ సమావేశం.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలుపై సీఎం ఫోకస్..
- రేపు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు భేటీ..
- వ్యవసాయ రుణాలు.. సంక్షేమ పథకాల అమలు.. రుణ లక్ష్యాలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SLBC Meeting: రేపు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం కానుంది రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ.. ఈ సమావేశంలో.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై కీలకంగా చర్చ సాగనుంది.. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాల పైనా ఎస్ఎల్బీసీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఎన్నికల ప్రచార సమయంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అందజేసింది.. ఇక, మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై దృష్టి సారిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Read Also: Mahesh Babu: కల్కి 2898 ఏడీ సినిమాకి మహేష్ బాబు లేట్ రివ్యూ
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
మరోవైపు.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈనెల 22వ తేదీ లేదా… ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. అయితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని ఆర్థిక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మరో నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఆర్థిక వెసులుబాటు.. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తోంది. ఏపీ ఆర్ధిక పరిస్థితిపై క్లారిటీ వస్తే… సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక శాఖ అంచనా. ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనకు…. ప్రభుత్వ పెద్దల ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!