Bhatti Vikramarka: స్వాతంత్య్రం కంటే ముందు నుంచి సింగరేణి.. సంస్థ విశ్వవ్యాప్తంగా విస్తరించాలి
- మెటల్స్.. నాన్ మెటల్స్ మైనింగ్ లో అడుగు పెట్టాలి
- లిథియంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి
- సింగరేణిపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి సంస్థ దేశ స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ.. ఎంతో నిష్ణాతులైన, సమర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. శని వారం బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రణాళిలు, అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధన వనరులకు కాలం చెల్లుతోంది. భవిష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మారబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో లిథియం వంటి అనేక మూలకాల అన్వేషణ, వాటిని వెలికితీయడంపై సింగరేణి దృష్టి సారించాలని చెప్పారు.
READ MORE: Crime: దారుణం.. తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
సింగరేణి సంస్థ తన మనుగడను కొనసాగిస్తూ ఆస్తులను సంపదను సృష్టించుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్ర ప్రజల సంపదైన సింగరేణి ద్వారా ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సింగరేణి సంస్థ మెటల్స్, నాన్ మెటల్స్ మైనింగ్ లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్నారు. ఇందుకోసం అవసరమైతే ఒక కన్సెల్టెన్సీని నియమించుకోవాలని సింగరేణి అధికారులకు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రికి సింగరేణి అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తీ డీపీఆర్ లు రూపొందిస్తున్నామని.. త్వరలోనూ వాటిని ప్రభుత్వానికి అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించారు. ఒరిస్సాలోని నైనీ బ్లాక్ లో బొగ్గు ఎప్పటినుంచి ఉత్పత్తి ఆరంభిస్తారని ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!