Coal Production: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్ బెల్ట్ జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వర్షం నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. కాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల బొగ్గు ఉత్పత్తి నాలుగో రోజు నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్టులోకి భారీగా వర్షం నీరు చేరింది. ఓసీపీలో 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. ఓబీలో 6 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నాలుగు రోజుల్లో 5.20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు, 24 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
Read also: Janhvi Kapoor-Radhika Merchant: అందుకే రాధిక మర్చంట్‌కు పార్టీ ఇచ్చా.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామికవాడలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు ఓపెన్ కాస్ట్ గనుల్లో సేకరిస్తున్న నీటిని బటయకు పంపుతున్నారు. భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 19,686 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 18,227 క్యూసెక్కుల వరద బయటకు వెళుతోంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌కు 385 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1387 అడుగులుగా ఉంది.
Read also: Telangana: భారీగా వస్తోన్న వరద.. ప్రాజెక్టులకు జల కళ..
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో అధికారులు 85 గేట్లను ఎత్తి వరదను వదులుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళను సంతరించుకుంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. దీంతో 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగుల వద్ద కొనసాగుతోంది. సాయంత్రానికి 40 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Swarnalatha Bhavishyavani 2024: ఈసారి వర్షాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.. భవిష్యవాణిలో..