దేశ సంపద, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న జవాన్లను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జవాన్ల భూములను కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ జవాన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ జవాన్ తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పని చేస్తున్న సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) చౌదరిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి.
Also Read:Nampally: అయాన్ కురుషి రౌడి షీటర్ హత్య.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
గ్రామంలో కొందరు వ్యక్తులు భూమి కబ్జా చేశారని… అధికారుల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదంటూ సెల్ఫీ వీడియో తీశారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఆర్డీవో, కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని వాపోయాడు జవాన్. తమ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో పంపించాడు జవాన్ రామస్వామి. నేను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని వాపోతున్న జవాన్. తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని జవాన్ రామస్వామి వేడుకుంటున్నాడు. జై జవాన్ అని అనడమే తప్ప ఆచరణలో మాత్రం ప్రజల వైఖరి ఇలా ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.