సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డిలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది.. తనకు సరైన భద్రత కల్పించడం లేదంటూ పీఎస్ లో దీక్షకు దిగారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దీంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెజ్జంకి పీఎస్‌కు తరలించారు. ఈసందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు అడ్డుపడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అయితే, రఘునందన్ రావును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సిద్దిపేట సీపీకి ఫోన్ చేసిన ఆయన.. కొందరు…
భూ వివాదంలో హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే… మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా భూ వివాదానికి లింక్ అయ్యే ఉందని చెబుతున్నారు పోలీసులు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి… తొగుట మండలం వెంకట్రావుపెట్ – జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు తిరుపతి – వంశీ…
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.. ప్రాజెక్టులు నిర్మాణం అయ్యేవి కావు.. నీళ్లు వచ్చేవి కావు.. ఆయన కారణజన్ముడు అంటూ ప్రశంసలు కురిపించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ ను అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు..…
తెలంగాణలో దళితుల సమగ్ర ప్రగతికి సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్గిపేట జిల్లానారాయణ రావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో దళిత బంధు అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు పాల్గొన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు హరీష్ రావు. దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలతో స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి మీ కాళ్లపై మీరు నిలబడాలన్నారు.…
బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ అంటే వారికి ఎంతో అభిమానం. దానిని వెరైటీగా చూపించాడు. సిద్దిపేట జిల్లా నంగునూర్ గ్రామానికి చెందిన బెదురు కూమారా స్వామి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వీరాభిమాని. ఆయనపై వున్న అభిమానంతో తన వ్యవసాయ క్షేత్రంలో వరి నారుతో బండి సంజయ్ అని వరి నాటారు. వరి నారు బాగా రావడంతో పేరు బాగా కనిపిస్తోంది. ఈ నారుని చూడడానికి…
కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసులు దాడి చేసిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. నా కార్యాలయంలో దాడులు…
కరోనా వీరవిహారం చేస్తోంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కరోనా బాధితులకు శాపం కానుంది. సిద్దిపేట పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మూడవ వార్డులో యువజన సంఘల సభ్యులు వ్యాక్సిన్ వేసుకోని వారి ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించడం కనిపించింది. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దంటున్నారు అధికారులు. తెలంగాణలో కరోనా మొదటి డోస్ సుమారుగా వంద శాతం పూర్తయింది. రెండో డోస్ వేయించుకోవడానికి జనం సిద్ధం అవుతున్నారు. కొంతమంది యువత వ్యాక్సిన్ పట్ల…
తెలంగాణ సీఎంగా కేసీఆర్ కావడం వల్లనే సిద్దిపేట ప్రాంతం దశ దిశా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట శివారు నాగులబండ వద్ద త్రీ స్టార్ టూరిజం హోటల్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టూరిజం శాఖ కార్పోరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… ఉత్తర తెలంగాణ నుండి హైదరాబాద్ వెళ్ళే వారికి ఈ హోటల్ చాలా…