ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ముందు 244 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గుజరాత్ బౌలర్లకు ఊచకోత చూపించాడు. 97* పరుగులతో చెలరేగాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ సెంచరీ మిస్ అయింది. చివరి ఓవర్లో సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ.. స్ట్రైక్ శశాంక్ సింగ్ ఉన్నాడు.
Read Also: Pakistan: హఫీస్ సయీద్ బంధువు హతం.. “గుర్తుతెలియని వ్యక్తుల” ఖాతాలో మరో ఉగ్రవాది..
పంజాబ్ బ్యాటింగ్‌లో కెప్టెప్ శ్రేయాస్ అయ్యర్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 42 బంతుల్లో 9 సిక్సులు, 5 ఫోర్లతో 97 పరుగులు చేశాడు. చివరలో శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులతో చెలరేగాడు. అంతకుముందు.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (47) మంచి ఆరంభాన్ని అందించాడు. మార్కస్ స్టోయినీస్ 20, ఒమర్జాయ్ 16 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌లో సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ సంపాదించారు.
Read Also: Boat Storm Infinity: 15 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్ విడుదల.. తక్కువ ధరకే