Telangana BJP : బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఇద్దరు ప్రముఖ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమావళిని ఉల్లంఘించారని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొని వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్ లకు ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. మంచిర్యాలలో రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఇద్దరు నేతలు పరస్పరం దూషణలకు పాల్పడినట్లు పార్టీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. క్రమశిక్షణ కమిటీ…
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ మే 1 నుంచి 31 వరకు యూనివర్సిటీ బోర్డర్లకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో నీరు, విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, బోర్డర్ అందరూ సహకరించాలని కోరారు.
Ayodhya: గత వారం ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశ నలుమూలల నుంచి వచ్చేసిన అతిరథమహారధుల మధ్య అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు లక్షలాది మంది ప్రతిరోజు అయోధ్యను సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో రకరకాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. అలాగే అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని ఏర్పడ్డాయి. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకుడి చేసిన కక్కుర్తిపని వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.…
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు వరంగల్ పోలీసులు.. లింగగిరి క్రాస్ రేపు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి వైఎస్ షర్మిల సిద్ధం అయ్యారు.. రేపటి నుండి పాదయాత్రను పునఃప్రారంభించేందుకు గాను పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.. అయితే, పాదయాత్ర అనుమతి కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దు..? అంటూ ఆమెకు పోలీసులు షోకాజ్ నోటీసులను అందజేశారు. పాదయాత్రకు మొదటి సారి పోలీసులు అనుమతిని ఇచ్చినప్పుడు.. వారు…
విజయవాడలో చెత్తపన్ను వసూలు చేయలేదని ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 48, 57వ వార్డు సచివాలయాల్లో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు చెన్నకృష్ణ, సలీమ్ బాష టార్గెట్ మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలం అయ్యారని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇద్దరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెత్త పన్ను వసూళ్లల్లో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చెత్త పన్నును వసూలు చేయాలని మున్సిపల్…
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్లో చెత్త పంచాయితీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తాకింది. విధి నిర్వహణలో మున్సిపాలిటీ కమిషనర్ పద్మజారాణి ఆదేశాలను, మున్సిపాలిటీ చట్టాలను బేఖాతర్ చేసిన బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామాల బుచ్చిరెడ్డికి , మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ షోకాజ్ నోటీస్లు జారీ చేసింది. మేడ్చల్ లోని బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య సమస్య అద్వానంగా తయారైంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట రోడ్లపై చెత్తను ఇష్టానుసారంగా పడేసి పోతున్నారు. దీంతో..…
విశాఖ జిల్లాలో నాలుగు థియేటర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు అధికారులు. టిక్కెట్ ధరలు పెంచినట్టు గుర్తించడంతో యాజమాన్యాలను వివరణ కోరింది యంత్రంగం. ఈ రకమైన ఫిర్యాదులు తొమ్మిది సినిమాహాళ్లపై రావడంతో… థియేటర్ల నిర్వహణ, టిక్కెట్ ధరలు,లైసెన్సులపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. అయితే సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు…
ప్రముఖ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ జావేద్ అక్తర్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ఓ టీవీ ఛానెల్ చర్చా ఘోష్ఠిలో చేసిన వ్యాఖ్యల కారణంగా కోర్టు కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. థానే లోని కోర్టులో ఒకరు జావేద్ అక్తర్ పై పరువు నష్టం దావా వేశారు. విషయం ఏమంటే… ఆ మధ్య ఓ న్యూస్ టీవీ ఛానెల్ చర్చలో జావేద్ అక్తర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)ను తాలిబన్ల తో పోల్చుతూ…