Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ మే 1 నుంచి 31 వరకు యూనివర్సిటీ బోర్డర్లకు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలతో నీరు, విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, బోర్డర్ అందరూ సహకరించాలని కోరారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసు అని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వేసవి సెలవుల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. మే 1 నుంచి 31 వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు ఇవ్వడం వివాదానికి దారి తీసింది.
Read also: Patanjali : బాబా రామ్‌దేవ్ తప్పుడు ప్రకటనల కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా వర్సిటీకి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు చీఫ్ వార్డెన్ తెలిపారు. చీఫ్ వార్డెన్ మాట్లాడుతూ వర్సిటీకి ఏటా వేసవి సెలవులు ఇస్తున్నామని, కరెంటు, నీటి కొరత అంశాన్ని ప్రస్తావించారు. గతేడాది కూడా ఇదే విషయాన్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఓయూలో విద్యుత్ కోత లేదని, తాగునీటికి కూడా కొరత లేదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. డిజిటల్ మీటర్ లో రీడింగ్ కూడా నిరంతర విద్యుత్ సరఫరాగా నమోదైందన్నారు. తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్‌కు ఓయూ రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
Read also: Gold Price Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
యూనివర్సిటీ విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, యూనివర్సిటీలో కరెంటు, తాగునీటి కొరత లేదని అన్నారు. చీఫ్ వార్డెన్ కావాలనే తప్పుడు ప్రకటన చేశారనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై విచారణకు ఆదేశించామని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో తేలిందని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని 33/11కేవీ సబ్‌స్టేషన్ నుంచి రెండు వేర్వేరు 11కేవీ ఫీడర్ల ద్వారా యూనివర్సిటీకి నిరంతర విద్యుత్ సరఫరా అవుతోందని, డిజిటల్ మీటర్ల రీడింగ్‌లో కూడా ఈ విషయం స్పష్టమవుతోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా చదువుకోవచ్చన్నారు.
Read also: Bihar Accident: విషాదం.. పెళ్లి కారుపై పడ్డ ట్రక్కు.. ఆరుగురి మృతి
గత ప్రభుత్వం అలవాటైన విధంగా ఈ ఏడాది కూడా అధికారులు ప్రకటన చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గతేడాది విడుదల చేసిన ప్రకటన తమ వద్ద ఉందన్నారు. మరోవైపు ఈ అంశంపై జలమండలి కూడా స్పందించింది. వాటర్ బోర్డు అధికారులు సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్‌తో కలిసి యూనివర్సిటీని సందర్శించారు. ఒప్పందం కంటే ఎక్కువ నీరు సరఫరా అవుతున్నట్లు నిర్ధారణ అయింది. అవసరమైతే ఓయూ అధికారుల విజ్ఞప్తి మేరకు మరిన్ని నీటిని సరఫరా చేసేందుకు వాటర్ బోర్డు సిద్ధంగా ఉందన్నారు. వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి ఓయూ వీసీ రవీందర్ తో ఫోన్ లో మాట్లాడి విచారించారు. వివాదానికి కారణమైన వార్డెన్ పై వీసీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Uttarpradesh : అత్తకు రూ.200ఇచ్చాడని భర్తపై అలిగి పిల్లలతో సహా బావిలోకి దూకిన తల్లి