ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్‌మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Shocking Incident: రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా రాయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన కాస్త ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. గుడియా గ్రామానికి చెందిన చరిత్రాపాతి తేజపాల్ సింగ్ ఉదావత్ అనే వ్యక్తి, తన సొంత డ్రైవర్‌ను జేసీబీకి తలకిందులుగా కట్టేసి, బెల్ట్‌తో దారుణంగా కొట్టాడు. ఈ హింసాత్మక ఘటన సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. డ్రైవర్ గాయపడిన తరువాత కూడా, అతని వదలకుండా గాయాలపై ఉప్పు రుద్ది తీవ్రంగా వేధించారు. ఈ ఘటన మూడు…
Murder : నగరంలోని రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో పట్టపగలు ఓ దారుణ హత్య జరిగింది. ఓ హోటల్‌లో టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని ఐదుగురు దుండగులు కత్తులతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతుడు నాంపల్లిలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్‌కు టీ తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులు కత్తులతో అతనిపై విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే అతడిని…
తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్‌కు విశిష్ట అతిథి వచ్చింది. ఏ వీఐపీనో... సెలబ్రిటీనో కాదు. ఎన్నడూ పోలీస్ వాళ్లు కూడా చూడని అతిథి రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
MMTS Train Case: హైదరాబాద్ లోని MMTS ట్రైన్‌లో అత్యాచారయత్నం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. ట్రైన్ లో యువతి పై జరిగినదన్న అత్యాచారం అబద్ధంగా తేలింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ట్రైన్ లోనుండి జారిపడిన యువతి, అనంతరం తనపై అత్యాచారం జరిగిందని కథ అల్లింది. ఆమె కథనాల…
కన్న కొడుకే ఆమె పాలిట యముడయ్యాడు. కని పెంచిన కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయం విన్న వారందరూ ఆ కొడుకుపై విరుచుకుపడుతున్నారు. తన వృద్ధ తల్లి ప్రాణాలను తీసిన కొడుకును చూసి అసహ్యించుకుంటున్నారు. కుక్క కొనడానికి రూ.200 ఇవ్వాలని కొడుకు కోరగా.. ఆ తల్లి నిరాకరించిందని అందుకో తన 70 ఏళ్ల తల్లిని కొట్టి చంపాడని పోలీసులు చెబుతున్నారు.
నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
Hyderabad: హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై గర్భవతిగా ఉన్న భార్యను భర్తే బండరాయితో పలుమార్లు కొట్టి హత్యకు యత్నించిన ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే వికారాబాద్‌కు చెందిన ఎండీ బస్రత్ (32), షబానా పర్వీన్ (22) దంపతులు హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం షబానా రెండు నెలల గర్భిణి.…
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లలను దారుణంగా చంపిన తర్వాత తండ్రి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందంతో సహా భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తండ్రి తన నలుగురు అమాయక పిల్లల గొంతు కోసి చంపి.. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.