ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
READ MORE: Chandrababu: రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..
వారికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తెకు దాదాపు 17 సంవత్సరాలు. అయినా.. ఆ మహిళ తన భర్త యొక్క మామ కొడుకుకుతో ప్రేమ వ్యవహారం ప్రారంభించింది. ఆ వ్యక్తికి కూడా పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. తన భార్య వ్యవహారం గురించి ఆ భర్తకు తెలిసింది. చాలాసార్లు తన భార్యకు ఆ వ్యక్తి సర్ది చెప్పాడు. తమకు వయసు కొచ్చిన పిల్లలు ఉన్నారని, ఇలా వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం సరికాదని వారించాడు. అయినా.. ఆ మహిళ అస్సలు వినలేదు.
READ MORE: China: వివాదాస్పద ద్వీపంలో చైనా H-6 బాంబర్లు ల్యాండ్.. దేనికి సంకేతాలు!
దీంతో విసిగి పోయిన ఆ వ్యక్తి.. తన భార్య, ఆమె ప్రియుడిని పంచాయితీకి పిలిపించాడు. అక్కడ కూడా ఆ ప్రేమ జంట ఎవ్వరి మాట వినలేదు. చేసేదేమి లేక నిస్సహాయ స్థితిలో ఆ భర్త, తన భార్యకు ప్రియుడికి అప్పగించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి జీవించమని కోరాడు. మరోవైపు, ఆ మహిళ తన భర్త పెళ్లైనప్పటి నుంచి తనను అనుమానిస్తూ, కొడుతున్నాడని భార్య చెబుతోంది. ఈ అంశంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని SHO మహేష్ చంద్ర అన్నారు. ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.