భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ…
Shocking Incident : తెలంగాణలో మానవత్వం మంటగలిసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిపై నమ్మకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ, హృదయ విదారకమైన పాశవిక చర్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన రోజా అనే యువతి తన స్నేహితురాలిని (26) ఇంటికి ఆహ్వానించి ఘోర మోసానికి పాల్పడింది. మద్యం తాగించి, ఆమెను మత్తులోకి నెట్టివేస్తూ, తన ప్రియుడు ప్రమోద్ చేత ఆమెపై అత్యాచారం చేయించింది. అంతేకాదు, ఈ దారుణ ఘటనను వీడియో…
అక్రమ సంబంధాలు... మానవ సంబంధాలను మాటగలుపుతున్నాయి. ప్రియుడు, ప్రియురాలు వ్యామోహంలో పడి.. కట్టుకున్నవారినే కాదు... కన్న తల్లి, తండ్రిని సైతం అంతం చేస్తున్నారు. చివరకు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను కూడా కర్కశంగా చంపేస్తున్నారు.. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన సోదరుని సైతం కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపేసింది.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రియురాలి తల్లిని ప్రియుడు అతి కిరాతకంగా చంపేసి బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోయాడు..
Father Funeral Rites: మధ్యప్రదేశ్‌లోని తికమ్గఢ్ జిల్లా లిధౌరా తాల్ గ్రామంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ఇద్దరు కుమారులు దామోదర్, కిషన్ సింగ్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ వివాదం ఎంతంగా ముదిరందంటే.. చివరకు తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరూ విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించేంతగా. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 3వ…
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ వ్యక్తి పట్టాల మధ్యలో పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ వ్యక్తి కన్నూర్ సమీపంలోని ట్రాక్ మధ్యలో పడుకోవడం.. రైలు అతనిపై నుంచి వెళ్ళడం చూడవచ్చు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నూర్- చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
Mumbai Train Incident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వెళ్ళే లోకల్ రైలు ఘట్‌కోపర్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలులో ఎక్కాడు. అదికూడా నేరుగా మహిళల కంపార్టుమెంట్‌లో ప్రవేశించాడు. దీనితో రైల్లో ప్రయాణిస్తున్న మహిళల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. మహిళలు అందరూ అతడిని రైల్లో నుంచి బయటకు వెళ్లాలని అరిచారు. అయినా కానీ, అతడు వారి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో అందరినీ కలిచివేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి గత నాలుగేళ్లలో గ్రామంలోని సుమారు 80 పశువులకు విషమిచ్చి చంపేశాడు. అతను నిశ్శబ్దంగా ప్రజల ఇళ్లలోని పశువుల కొట్టంలోకి ప్రవేశించి, ఆవులు, ఎద్దులకు విషం పెట్టి అక్కడి నుంచి పారిపోయే వాడు. గ్రామంలో పశువులకు అంటువ్యాధి వచ్చిందని మొదట్లో ప్రజలు అనుకున్నారు. దీంతో ఆవులు, ఎద్దులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఓ రైతు ఇంట్లో…
పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలో ఒక బిచ్చగాడు తన అమ్మమ్మ జ్ఞాపకార్థం గొప్ప విందు ఏర్పాటు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అపూర్వ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీటీఎం లేఅవుట్లోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా తనను వేధించారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆరోపించింది. పని పూర్తి చేసుకునిఇంటికి తిరిగి వస్తుంది నేహా బిస్వాల్ అనే యువతి. అకస్మాత్తుగా ఓ బాలుడు సైకిల్పై ఆమె వద్దకు వచ్చి రొమ్ముపై టచ్ చేసి.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో నేహా ఒక వీడియో బ్లాగ్ రికార్డ్ చేస్తోంది.
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.