ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. సదరు విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గోపాల్‌పూర్ బీచ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రారంభంలో ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.
READ MORE: CM Chandrababu: కుప్పం బాధితురాలికి చంద్రబాబు ఫోన్.. ఆర్థికసాయం ప్రకటన.. నిందితులకు వార్నింగ్..
గోపాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తాను, తన ప్రియుడితో కలిసి బీచ్‌లోని ఏకాంత ప్రదేశంలో కూర్చున్నప్పుడు 10 మంది వ్యక్తులు తమ వద్దకు వచ్చారు. వారు తన ప్రియుడిని చుట్టుముట్టి చేతులు, కాళ్లను కట్టివేశారు. దీని తర్వాత.. వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. కాగా.. ఈ ఘటన అనంతరం నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.
READ MORE: CM Revanth Reddy: గో సంరక్షణపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
ఈ అంశంపై ఎస్పీ శరవణ వివేక్ ఎం మాట్లాడుతూ.. “బాధిత యువతిపై ముగ్గురు వ్యక్తులు వరుసగా అత్యాచారం చేశారు. మరో ఏడుగురు వారికి భద్రత కల్పించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశాం. నిందితుల్లో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. వారు ఈ దారుణమైన నేరంలో పాల్గొన్నందున వారిని మేజర్లుగా పరిగణించాలని పోలీసులు కోర్టును అభ్యర్థిస్తారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాం” అని తెలిపారు.