కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద బెయిల్‌పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు.
ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు.
మహారాష్ట్ర ముంబయిలోని అంధేరి ఈస్ట్‌కు జరిగిన ఉపఎన్నికలో ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే భార్య రుతుజ లట్కే విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటా నిలిచింది.
దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన హవా కొనసాగించింది. మొత్తం 7స్థానాల్లో ఎన్నికలు జరగగా.. బీజేపీ 3 సీట్లను కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్, హర్యానాలోని ఆదంపూర్‌లో బీజేపీ విజయం సాధించగా, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో ఆధిక్యంలో ఉంది.
తూర్పు అంధేరీ ఉపఎన్నికల కోసం శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మూడు పేర్లు, చిహ్నాలతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. దీంతో థాకరే వర్గం ఆదివారం నాడు పార్టీకి గుర్తుగా త్రిశూల్, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తులను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన గుర్తు అయిన "విల్లు - బాణం"ను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
CM eknath shinde comments on uddhav thackeray: దసరా వేడుకలు మహారాష్ట్ర రాజకీయాల్లో కాకపుట్టించాయి. సీఎం ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మధ్య మాటల యుద్ధం చెలరేగింది. శివసేన ఇరు వర్గాల మధ్య విమర్శలు చెలరేగాయి. సీఎం ఏక్ నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. బాల్ థాకరే స్థాపించిన పార్టీ ఎవరి ప్రైవేట్ కంపెనీ కాదని.. అది అందరికి చెందుతుందని అన్నారు. బుధవారం ముంబై జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. శివసేన…
Supreme Court On shivsena party issue: మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కొనసాగుతోంది. అసలైన శివసేన ఎవరిదనే ప్రశ్నకు ఇక కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం ఇవ్వనుంది. తాజాగా సుప్రీంకోర్టులో మాజీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ తాకింది. శివసేన పార్టీపై ఇటు ఏక్ నాథ్ షిండే వర్గం, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే తాజాగా మంగళవారం రోజు ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Devendra Fadnavis comments on uddhav thackeray: మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఫడ్నవీస్ ను ఠాక్రే ఎప్పుడూ అంతం చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి నన్ను అంతం చేయాలని చూశారు.. అది మీల్ల కాలేదు అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీ ఫోటో చూపించి ఎన్నికల్లో పోటీ చేశారు.. ఆ తరువాత బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్, ఎన్సీపీలతో…
shivsena's Thackeray Camp on bilkis bano case: బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రిపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విడుదల ద్వారా దేశ మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ…