CM eknath shinde comments on uddhav thackeray: దసరా వేడుకలు మహారాష్ట్ర రాజకీయాల్లో కాకపుట్టించాయి. సీఎం ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మధ్య మాటల యుద్ధం చెలరేగింది. శివసేన ఇరు వర్గాల మధ్య విమర్శలు చెలరేగాయి. సీఎం ఏక్ నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. బాల్ థాకరే స్థాపించిన పార్టీ ఎవరి ప్రైవేట్ కంపెనీ కాదని.. అది అందరికి చెందుతుందని అన్నారు. బుధవారం ముంబై జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. శివసేన ఉద్ధవ్ ఠాక్రేది కానది.. శివసేన కోసం చెమటలు అర్పించిన శివసైనికులదని.. మీలాంది వారి కోసం కాదని ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేశారు.
Read Also: West Bengal: దుర్గా నిమజ్జనంలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి
అంతకు ముందు ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేను ద్రోహి అని విమర్శించారు. దీనికి బదులు ఇస్తూ.. 2019లో నిజమైన ద్రోహం జరిగిందని.. బ్యానర్లపై మోదీ, బాల్ థాకరే బొమ్మతో ఎన్నికలకు వెళ్లామని.. ఈ కూటమికే ప్రజలు పట్టం కట్టారని షిండే అన్నారు. కానీ మీరు కూటమిని వదిలి ఎన్సీపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపారని విమర్శించారు. ఉద్ధవ్ ఠాక్రే నన్ను కట్టప్పగా విమర్శిస్తున్నారని.. అయితే నేనుు కట్టప్పనే కావచ్చు.. కానీ ఆత్మగౌరవం ఉందని.. మీలాగా ద్వంద్వ ప్రమాణాలు లేవని ఏక్ నాథ్ షిండే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి ఓటేస్తే మీరు కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని ప్రజలను మోసం చేశారని.. ముంబైలోని బాల్ థాకరే స్మారంక వద్ద మోహకరిల్లాలని ఉద్దవ్ ఠాక్రేను డిమాండ్ చేశారు షిండే.
అంతకుముందు దసరా వేడులకల్లో పాల్గొన్న ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. సీఎం ఏక్ నాథ్ షిండేను కట్టప్పగా పోల్చారు. దేశద్రోహి అని.. వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. నేను ఆస్పత్రిలో చేరినప్పుడు రాష్ట్రబాధ్యతలు ఇచ్చిన వ్యక్తులు కట్టప్పగా మారి మాకు ద్రోహం చేశారని ఆయన అన్నారు. బీజేపీ, శివసేనకు ద్రోహం చేసిందని.. అందుకే కూటమి నుంచి బయటకు వచ్చామని ఆయన అన్నారు. తన తండ్రి పార్టీని ఏక్ నాథ్ షిండే దోచుకున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే దసరా వేడుకల్లో ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే అన్నా జైదేవ్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేతో వేదిక పంచుకున్నారు.