Uddav Thackeray: హతవిథీ.. ఉద్ధవ్ గుర్తు ఏంటి? త్రిశూలమా? ఉదయించే సూర్యుడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddav Thackeray: మహారాష్ట్రలో శివసేన పార్టీ ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్, షిండే వర్గాలకు వీల్లేకుండా పోయింది. ఉపఎన్నికల కోసం రెండు రోజుల్లోగా మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని ఈసీ సూచించిన విషయం తెలిసిందే.
శివసేనకు ఇప్పటిదాకా కొనసాగుతున్న ఎన్నికల గుర్తు విల్లంబును ఇరు వర్గాలూ వినియోగించడం కుదరదని ఎన్నికల సంఘం తెలిపింది. రెండు వర్గాల మధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. అంతేకాకుండా త్వరలో జరిగే ఉప ఎన్నికకు రెండు వర్గాలు తమ తమ గుర్తులను ఎంచుకోవాలని… అది కూడా రెండు రోజుల్లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తూర్పు అంధేరీ ఉపఎన్నికల కోసం శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మూడు పేర్లు, చిహ్నాలతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. దీంతో థాకరే వర్గం ఆదివారం నాడు పార్టీకి గుర్తుగా త్రిశూల్, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తులను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఇంకా, ఠాక్రే శిబిరం రాబోయే ఉప ఎన్నికలకు పార్టీ పేరును శివసేన (బాలాసాహెబ్ థాకరే), శివసేన (ప్రబోధంకర్ థాకరే) మరియు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పేర్లను సూచించింది.
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
Leg Chopped by Robbers: వందేళ్ల వృద్ధురాలి కాలు నరికిన దొంగలు.. ఎందుకో తెలుసా?
శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్న షిండే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివసేన తమదంటే కాదు… తమదని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, షిండే వర్గాలు వాదులాడుకుంటున్నాయి. ఈ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది. ఈ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!