మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చారు. మొత్తం 57 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఏక్ నాథ్ షిండే క్యాంపులోకి 39 మంది ఎమ్మెల్యేలు చేరారు. దాదాపుగా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే క్యాంపులో 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఉద్ధవ్ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏక్ నాథ్ షిండే సిద్ధమవుతున్నట్లు సమాచారం.…
మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శివసేనతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తోంది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే 35 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేయడంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు షిండే. శివసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు…
మహారాష్ట్రలో రాజీకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. మహావికాస్ అఘాడీని లీడ్ చేస్తున్న శివసేన పార్టీలోనే చీలిక వచ్చింది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే దాదాపు 35 మంది పైగా ఎమ్మెల్యేలతో అస్సాం గౌహతిలో క్యాంప్ పెట్టారు. శివసేన తన మూల సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. అయితే మహారాష్ట్రలో ‘మహా’…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ‘మహా’ మలుపులు తిరుగుతోంది. శివసేనలో చీలిక రావడంతో అక్కడ మహా వికాస్ అఘాడీ ఉమ్మడి సర్కార్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన మద్దతు ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. తమకు ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై నమ్మకం లేదని లేఖ కూడా విడుదల చేశారు ఎమ్మెల్యేలు. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై సంచలన ఆరోపణలు చేశారు. తమకు…
మహారాష్ట్రలో అధికార పక్షానికి భారీ ఎదురుదెబ్బ తీగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానా, మహరాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 16 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 8 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల ముందు బీజేపీ పెద్దల సభలో తన బలాన్ని మరింతగా పెంచుకుంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని రాజ్యసభ సభ్యుల ఎన్నిక అందర్ని ఆకర్షించింది. మహారాష్ట్రలో మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు…
మహారాష్ట్ర రాజకీయాలు రాజ్ ఠాక్రే కేంద్రంగా సాగుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ రాజకీయంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా శివసేన, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని టార్గెట్ చేస్తూ రాజ్ ఠాక్రే రాజకీయం చేస్తున్నారు. ఇటీవల మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని మహా సర్కార్ కు అల్టిమేటం జారీ చేసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు…
దేశవ్యాప్తంగా మహాారాష్ట్ర రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని మహరాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లతో ప్రార్థనలు వినిపిస్తే దానికి ప్రతిగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా వినిపిస్తామని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మే 3 వరకు గడువు రాజ్ ఠాక్రేకు శివసేన సర్కార్ కు గడువు విధించారు. దీనికి తోడు ఇటీవల అమరావతి…