Raj Thackeray: రేపు పుణేలో రాజ్ ఠాక్రే భారీ ర్యాలీ….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాలు రాజ్ ఠాక్రే కేంద్రంగా సాగుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ రాజకీయంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా శివసేన, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని టార్గెట్ చేస్తూ రాజ్ ఠాక్రే రాజకీయం చేస్తున్నారు. ఇటీవల మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని మహా సర్కార్ కు అల్టిమేటం జారీ చేసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయకుంటే… పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసాను పఠిస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే రాజ్ ఠాక్రే రేపు పుణేలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు రాజ్ ఠాక్రే. అయితే ఈ ర్యాలీకి సంబంధించి పోలీసులు 13 ఆంక్షలను విధించారు. ఒక వేళ ఉల్లంఘనటకు పాల్పడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ర్యాలీ సమయంలో ఎలాంటి రెచ్చగొట్టే నినాదాలు చెయవద్దని, అల్లర్లకు పాల్పడవద్దని, కార్యక్రమంలో ఎలాంటి ఆయుధాలు, కత్తులు , పేలుడు పదార్థాలు తీసుకురాకూడదని… లౌడ్ స్పీకర్ల వాడకం శబ్ధ కాలుష్య నియమాలను ఉల్లంఘించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.
Also Read
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
రాజ్ ఠాక్రే నిర్వహిస్తున్న ర్యాలీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారో అని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీనే రాజ్ ఠాక్రే వెనకాల ఉండీ కథ నడిపిస్తోందని శివసేన ఆరోపిస్తోంది. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రగా అభివర్ణిస్తోంది. ఇదిలా ఉంటే ముంబైలో ఇటీవల రాజ్ ఠాక్రే పేరుతో పెట్టిన ప్లెక్సీల్లో ఎంఎన్ఎస్ పార్టీ నేతలు నేరుగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్ ఠాక్రేకు ఎదైనా జరిగితే మహారాష్ట్ర అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క