Loud speakers row: మహారాష్ట్ర్రలో కాకరేపుతున్న లౌడ్ స్పీకర్స్ వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా మహాారాష్ట్ర రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని మహరాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లతో ప్రార్థనలు వినిపిస్తే దానికి ప్రతిగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా వినిపిస్తామని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మే 3 వరకు గడువు రాజ్ ఠాక్రేకు శివసేన సర్కార్ కు గడువు విధించారు. దీనికి తోడు ఇటీవల అమరావతి ఎంపీ నవనీత్ రాణా… సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇళ్లు ‘ మాతోశ్రీ’ ముందు హనుమాన్ చాలీసా వినిపించేందుకు సిద్ధం కావడం.. ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి బెయిల్ రావడంతో బయటకు వచ్చారు.
మహారాష్ట్రలో హిందుత్వం కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ జరుగుతోంది. హఠాత్తుగా రాజ్ ఠాక్రే లౌడ్ స్పీకర్ వర్సెస్ హనుమాన్ చాలీసా వివాదం రాజేయడంతో హిందుత్వాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం ఎంఎన్‌ఎస్, రాజ్ ఠాక్రే వెనక బీజేపీ పార్టీ ఉందని ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రోద్భలంతోనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అధికారం కోసం శివసేన భావవైరుధ్యం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టడంతో… శివసేన తన హిందుత్వాన్ని విడిచిపెట్టిందనే భావన కలిగించేలా ఎంఎన్ఎస్ లౌడ్ స్పీకర్ల వివాదాన్ని రాజేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు శివసేన హిందుత్వ పార్టీ ఉండీ ప్రస్తుతం తన సిద్ధాంతాన్ని విడిచిపెట్టిందనే భావన ప్రజల్లో కలిగించేలా.. మహారాష్ట్రలో హిందుత్వానికి బ్రాండ్ గా నిలిచేలా రాజ్ ఠాక్రే ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హిందుత్వానికి శివసేన స్కూల్ వంటిదని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం రాజ్ ఠాక్రేను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాజ్ ఠాక్రేకు పలు 2008లోని ఓ కేసులో రాజ్ ఠాక్రేకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్ట్. ఈ పరిణామాల మధ్య వచ్చే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన కలిసి పోటీ చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!