Balasaheb Thackeray: శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాలాసాహెబ్ ఠాక్రే జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తన విశ్వాసాల విషయంలో ఎక్కడ రాజీ పడలేదని, భారతీయ సంస్కృతి గర్వాన్ని పెంచడానికి ఎల్లప్పుడూ కృషి చేశారని ప్రధాని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆప్-బీజేపీ మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది.
Sanjay Raut: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అజిత్ పవార్, శరద్ పవార్ కలిపోతారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే, బీజేపీ సర్కార్ అంటేనే విరుచుకుపడే శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు.
Jalgaon Clash: మహారాష్ట్రలోని జల్గావ్‌లో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి ఘటన వెలుగు చూసింది. శివసేన మంత్రి గులాబ్రావ్ పాటిల్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం హారన్ మోగించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
నేడు మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లోని ప్రాంగంణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహాయుతి కూటమిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎం ఆలయాన్ని నిర్మిస్తామని తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రకటించాలని ఆయన అన్నారు.
Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది.
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈరోజు (డిసెంబర్ 3) థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, హస్పటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు అతనికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.