Election Results: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం హోరాహోరీని తలపిస్తున్నాయి. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 41. అయితే, బీజేపీ కూటమి, జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి మధ్య లీడ్ మారుతోంది.
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఈ రోజు మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇరు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ నుంచి బీజేపీ కూటమి రెండు రాష్ట్రాల్లోనూ లీడింగ్‌లో ఉంది. తాజాగా ఆధిక్యంలో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ.. జార్ఖండ్‌లో ఆధిక్యం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య చేతులు మారుతోంది. Read Also: Virender Sehwag: ఆర్యవీర్.. తృటిలో ఫెరీరా కారు…
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ కూటమి దూసుకుపోతోంది. బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సీట్ల సంఖ్య ప్రత్యర్థి పార్టీల కన్నా ఎక్కువగా ఉంది.
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం ఎదురుచూస్తోంది. ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లోక్‌సభ, హర్యానా ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు.
Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచేది ఎవరో రేపటితో తేలబోతోంది. అయితే, అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని సర్వే సంస్థలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమినే అధికారం వస్తుందని అంచనా వేశాయి.
Eknath Shinde: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగి, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, ఎన్నికలకు కొద్దిరోజులుగా శివసేన, బీజేపీ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచందానీ చేసిన ప్రకటనపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ నేతలు క్షమాపణలు చెబితే తప్ప ఇక్కడ బీజేపీ అభ్యర్థికి శివసేన పనిచేయదని పేర్కొంది. యువసేన కళ్యాణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కీ భుల్లార్ మాట్లాడుతూ.. రాంచందనీ…
సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన నిందితులను ఎవరి కూడా వదిలి పెట్టేది లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు.