Sanjay Raut: మహాయుతి ప్రభుత్వంపై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు.. ఈవీఎంల ఆలయాన్ని నిర్మించాలంటూ..!
- మహాయుతి కూటమిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు
- ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎం ఆలయాన్ని నిర్మిస్తామని..
- తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రకటించాలి- ఎంపీ సంజయ్ రౌత్
- కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం క్యాబినెట్ బాధ్యతలపై నిర్ణయం తీసుకోలేక పోయింది- సంజయ్ రౌత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాయుతి కూటమిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎం ఆలయాన్ని నిర్మిస్తామని తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రకటించాలని ఆయన అన్నారు. ‘ముందుగా ముఖ్యమంత్రి ఊరేగింపును అక్కడికి తీసుకువెళతారు. సీఎం ఊరేగింపు చేపట్టే ముందు ఈవీఎంల ఊరేగింపు చేపట్టాలని, తొలి కేబినెట్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంల ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాను’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. .
Read Also: Cabinet Expansion: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. ఎంతమంది ప్రమాణస్వీకారం చేయనున్నారంటే..?
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం క్యాబినెట్ బాధ్యతలపై నిర్ణయం తీసుకోలేక పోయిందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహారాష్ట్రలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని సంజయ్ రౌత్ తెలిపారు. ‘‘ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తున్నా ఎవరికి ఏ శాఖ ఉందో తెలియడం లేదు.. మహారాష్ట్ర గ్రామాల్లో రోజూ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనికి సమాధానం చెప్పలేని సీఎం.. మహారాష్ట్రలో అరాచకం సాగుతుంది. ఈ ప్రభుత్వం ఈవీఎంలతో ఏర్పడింది, వారికి మెదడు లేదు, వారి మెదళ్లలో ఈవీఎంలు ఉన్నాయి” అని రౌత్ ఆరోపించారు.
Read Also: IND vs AUS 3rd Test: వరుణుడి ఆటంకం.. మొదటి రోజు ముగిసిన ఆట
అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తాము ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. ‘ఏక్ హైతో సేఫ్ హై’ అనే ప్రధాని మోదీ నినాదం రాష్ట్రంలో మాయాజాలంలా పని చేసిందని ఫడ్నవీస్ చెప్పారు. డిసెంబరు 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయగా.. ఉపముఖ్యమంత్రులుగా శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ఈ ఫలితాలు కీలక మైలురాయిగా నిలిచాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కూడా వరుసగా 57, 41 స్థానాలతో విజయాలు సాధించాయి.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!