బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక ప్రభుత్వం శనివారం ఒక పెద్ద అడుగు వేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ప్రకటించింది. ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిషేధం విధించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో అవామీ లీగ్, దాని నాయకులపై జరుగుతున్న విచారణ…
Chinmoy Krishna Das: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్‌కి బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇస్కాన్ మాజీ నాయాకుడు, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సతానత జాగ్రన్ జోట్ ప్రతినిధి అయిన దాస్‌ని నవంబర్ 25న ఢాకా ఎయిర్ పోర్టులో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే కారణంగా అతడిపై దేశద్రోహ కేసు నమోదు చేశారు. తాజాగా, ఆయనకు జస్టిస్ ఎండీ అటోర్ రెహమాన్, జస్టిస్ ఎండీ…
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా దిగిపోయిన తర్వాత, ఆమెపై వందలాది కేసులు నమోదయ్యాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాని అప్పగించాలని పలుమార్లు భారత్‌ని కోరింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్‌ని ఆశ్రయించింది.
Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇరు దేశాలకు చెందిన విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 1971 నాటి అఘాయిత్యాలపై పాక్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఢాకా డిమాండ్ చేసింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను విదేశాలతో కలిసి దేశ పతనానికి కుట్ర పన్నిన "స్వార్థపరుడైన రుణగ్రహీత"గా అభివర్ణించారు. విద్యార్థి నిరసనకారుడు అబూ సయీద్‌ను చంపిన దానిపై కూడా ఆమె సందేహాలను లేవనెత్తారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ తన పట్టు నిలుపుకునేందుకు గేమ్స్ ఆడుతున్నాడు. ముఖ్యంగా, లౌకికవాదిగా, మాజీ ప్రధాని షేక్ హసీనాకు నమ్మకస్తుడిగా ఉన్న ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ని ఆ పదవి నుంచి దించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, అక్కడి మతోన్మాద సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ దేశానికి తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఆవామీ లీగ్ పార్టీ కార్యకర్తలతో జరిగిన సంభాషణ సందర్భంగా ఈ విషయం తెలియజేసింది.
Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్ భారత్‌ని ఏదో రకంగా విసిగిస్తూనే ఉంది. కొత్త పాలకుడు మహ్మద్ యూనస్ భారత్ టార్గెట్‌గా గేమ్స్ ఆడుతున్నాడు. దీనికి తోడు ఆయనకు మద్దతు ఇస్తున్న మతోన్మాద సంస్థలు జమాతే ఇస్లామీ, బీఎన్పీ వంటి పార్టీలు భారత్ వ్యతిరేక ధోరణిని అవలంభిస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూనస్ పాకిస్తాన్, చైనాకలు పెద్దపీట వేస్తున్నాడు.
గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వీడిన ఆమె భారత్‌లో తలదాచుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం మన దేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే.. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరోసారి తిరుగుబాటు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన బంగ్లా సైన్యం ఇప్పటికే తీవ్రంగా…
Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజధాని ఢాకాలో విస్తృతంగా సైన్యం మోహరించింది. ఇది తిరుగుబాటు ఊహాగానాలను లేవనెత్తుతోంది. ఢాకాలో ఎప్పుడూ లేని విధంగా సైన్యం మోహరించడం చూస్తే ఏదో జరగబోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా సైన్యం, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్, పారామిలిటరీ బలగాలు మోహరించబడ్డాయి.…