Bangladesh: హిందూ వ్యాపారి హత్య, డెడ్‌బాడీపై డ్యాన్స్ చేస్తూ పైశాచికం..
- బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కరువు..
- హిందూ వ్యాపారిపై మూక దాడి..
- డెడ్‌బాడీపై డ్యాన్స్ చేస్తూ పైశాచికం..
- దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత, భారత్‌పై ద్వేషం రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారో, అప్పటి నుంచి ఆ దేశంలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హిందువుల భద్రతను పట్టించుకోవడం లేదు. యూనస్ సర్కారులో మతోన్మాదులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, హిందువుల ఆస్తులు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌లో ఓ స్క్రాప్ వ్యాపారి హత్య ఆ దేశంలో ఆగ్రహానికి కారణమైంది. వ్యాపారిని దారుణంగా కొట్టి చంపారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత, డెడ్‌బాడీపై డ్యాన్సులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడం దేశ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించబడిందని హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి తెలిపారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Read Also: Ambati Rambabu: సైకోల్లా దాడులు చేస్తున్నారు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం..
జూలై 09న మిట్‌ఫోర్డ్ హాస్పిటల్ సమీపంలో లాల్ చంద్ అలియాస్ సోహాగ్ దారుణహత్యకు గురయ్యాడు. రాజధాని ఢాకాలో జరిగిన ఈ హత్య అనాగకరికమైందని చౌదరి అన్నారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు బంగ్లా నిఘా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి, వారికి ఏ రాజకీయ పార్టీలో సంబంధం ఉన్న వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. మిట్‌ఫోర్డ్ హత్య కేసును స్పీడీ ట్రయల్ ట్రిబ్యునల్‌కు మార్చడానికి చర్యలు తీసుకున్నట్లు చౌదరి చెప్పారు.
గురువారం వైరల్ అయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, వ్యాపారిని కాంక్రీట్ ముక్కలతో కొట్టి చంపడం చూడొచ్చు. ఈ మూక హత్యలో పాల్గొన్నవారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న టైటన్ గాజీ 5 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ హత్య దేశంలో ఆగ్రహానికి కారణమైంది. శనివారం వందలాది మంది విద్యార్థులు మూక హింసను ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని ఆరోపిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ నెల ప్రారంభంలో ఇలాంటి మరో సంఘటనలో, సెంట్రల్ కుమిల్లాలోని మురాద్‌నగర్ ప్రాంతంలో మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఒక మహిళ మరియు ఆమె కుమారుడు మరియు కుమార్తెను కొట్టి చంపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!