Bangladesh : షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆ ప్రజలను అదుపులోకి తీసుకుంటున్నారు.
Bangladesh: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుమారుడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్(ఓఎస్ఎఫ్) ఛైర్పర్సన్ అలెక్స్ సోరోస్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌కి ఆర్థిక సాయాన్ని ఆపేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత అక్టోబర్ నెలలో సోరోస్, యూనస్ కలిశారు. తాజాగా వీరిద్దరు రెండోసారి కలుసుకున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు.
ఆ అల్లాయే లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడే దాన్ని కాదన్నారు. కుట్రదారులు నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేశారో మీరందరూ చూశారు. కానీ, నేను నా దేశం నుంచి కట్టుబట్టలతో రావడంపై చాలా బాధగా ఉందని షేక్ హసీనా కన్నీరు పెట్టుకుంది.
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత దేశం విడిచి భారత్‌లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు షేక్ హసీనా సహా 96 మంది పాస్‌పోర్టులను పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ విభాగం రద్దు చేసింది. గతేడాది జూలైలో జరిగిన హత్యలలో వారి ప్రమేయం ఉన్నందున చర్యలు తీసుకున్నారు. హసీనాపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) హసీనా, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు,…
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై సోమవారం బంగ్లాదేశ్ కోర్టు రెండోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆమె 15 ఏళ్ల పాలనలో మానవత్వానికి వ్యతిరేకంగా అనేక నేరాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం మరోసారి వారెంట్ ఇష్యూ చేశారు. షేక్ హసీనా పదవీ కాలంలో 500 మందికి పైగా వ్యక్తులు భద్రతా దళాలచే కిడ్నా్ప్ చేయబడి రహస్య ప్రాంతాల్లో ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. హసీనాతో…
Bangladesh: భారతదేశంలో బంగ్లాదేశ్‌కి చెందిన దిగువ న్యాయవ్యవస్థ జడ్జిలకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడి యూనస్ సర్కార్ రద్దు చేసింది. ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఒక రోజు తర్వాత దానిని రద్దు చేసింది. ఈ శిక్షణా కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ అండ్ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో జరగాల్సి ఉంది. శిక్షణకు సంబంధించిన అన్ని ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, భారత్-బంగ్లాల మధ్య సంబంధాలు మునుపటిలా లేవు. ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, హిందువులపై దాడులు, భారత్ వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. దీనికి తోడు బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలు భారత్‌కి ఆందోళనకరంగా మారాయి.
Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్‌లో కోలువు తీరిన మహ్మద్ యూనస్ సర్కార్ భారత వ్యతిరేక చర్యల్ని ప్రోత్సహిస్తోంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు హిందువుల, ఇతర మైనారిటీలు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. ఇదే కాకుండా జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీకి చెందిన పలువురు వివాదాస్పద నేతల్ని జైళ్ల నుంచి విడుదల చేస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా భారత్ అంటేనే ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటాయి. పలువురు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ అనుకూల,…