Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలు ఆగడం లేదు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, ఆ దేశంలో మతోన్మాదులకు, ఉగ్రవాదులకు అడ్డులేకుండా పోతోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఈ అరాచకాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ వంటి సంస్థల నేతలు చెలరేగిపోతున్నారు.
Read Also: Kolkata rape Case: కోల్‌కతా అత్యాచార నిందితుడికి నేర చరిత్ర..మహిళలపై వేధింపులు, క్యాంపస్‌లో హింస..
తాజాగా మురాద్ నగర్ సబ్ డిస్ట్రిక్‌లో 21 ఏళ్ల హిందూ మహిళపై అత్యాచారం జరిగింది. స్థానిక బీఎన్పీ నేత ఫజోర్ అలీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇతడితో పాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింనందుకు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన జూన్ 26, 2025న జరిగింది, రామచంద్రపూర్ పచ్కిట్ట గ్రామానికి చెందిన 38 ఏళ్ల ఫజోర్ అలీ రాత్రి 10 గంటల ప్రాంతంలో బాధితురాలి తండ్రి ఇంట్లోకి చొరబడి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. స్థానిక హరిసేవ పండగ కోసం తన పిల్లలతో కలిసి తల్లిగారింటికి వచ్చింది. అదే సమయంలో నిందితుడు అలీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు, ఆదివారం ఉదయం ఢాకాలోని సయదాబాద్ ప్రాంతంలో అలీని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, ఈ సంఘటన ఈ ప్రాంతంలో నిరసనలకు దారితీసింది, హిందూ మహిళపై ముస్లిం వ్యక్తి చేసిన దాడిపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.