బంగ్లాదేశ్ ప్రజలకు మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక సందేశం పంపించారు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా.. గంభీరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తన దేశస్థులకు విజ్ఞప్తి చేశారు. బంగబంధు భాబన్‌లో పూల దండలు సమర్పించి ప్రార్థించాలని కోరారు. ఆత్మలందరి మోక్షానికి ప్రార్థించాలని షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ తన సోషల్ మీడియా ఎక్స్‌లో షేక్ హసీనా తరపున ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Lucknow Horror: విద్యార్థిని కిడ్నాప్.. కదులుతున్న కారులో అత్యాచారం..
కోటా ఉద్యమం ఉధృతం కావడంతో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో వందిలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. ఇక్కడ నుంచి యూకేకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సఫలీకృతం కాలేదు. దీంతో ఆమె భారత్‌లోనే ప్రస్తుతం బస చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం నుంచి హసీనాకు పిలుపువచ్చింది. దేశానికి రావాలని ఆహ్వానించారు. మరోవైపు హసీనాపై క్రిమినల్ కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: Kamikaze Drones: ప్రాణాంతక ‘‘ఆత్మాహుతి డ్రోన్‌ల’’ ఆవిష్కరణ.. స్వదేశీ టెక్నాలజీతో తయారీ..
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ అల్లర్లతో తమకు సంబంధం లేదని అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ ప్రియరీ ఖండించారు. ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఎంచుకున్న నిర్ణయమని తెలిపారు. వారి భవిష్యత్‌ను నిర్ణయించుకునే అధికారం వారికే ఉందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇది తప్ప ఇంకేమీ ఆరోపణలు వచ్చినా అవన్నీ అవాస్తవమేనని జీన్ ప్రియరీ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉన్నట్లుగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. అమెరికాకు తలవంచకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. షేక్ హసీనా ఆరోపణలు అంతర్జాతీయంగా పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా వైట్‌హౌస్ స్పందిస్తూ ఖండించింది.
Son of deposed Prime Minister of Bangladesh Sheikh Hasina, Sajeeb Wazed Joy releases a statement on behalf of Sheikh Hasina on his social media handle X.
…I appeal to you to observe the National Mourning Day on 15th August with due dignity and solemnity. Pray for the salvation… pic.twitter.com/b1qRgOP06r
— ANI (@ANI) August 13, 2024