కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలకు ఆయన నామినేషన్ వేస్తారనే ఊహాగానాల మధ్య, పార్టీ చీఫ్ రేసులో తాను లేనని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం తెలిపారు.
Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక పోటీలో ఎవరెవ్వరు ఉంటారనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి దూరంగా ఉండాలని గాంధీ కుటుంబం భావిస్తోంది. ఎన్నికల్లో కలుగచేసుకోవద్దని.. అర్హత ఉన్నవారు పదవికి పోటీ చేయాలని గాంధీ కుటుంబం పార్టీ నేతలకు చెబుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాహుల్ గాంధీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను పోటీలో ఉండటం లేదని.. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది… ఎల్లుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.. ఇక, ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా… అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేస్తూ వస్తున్నాయి పలు రాష్ట్రాల పీసీసీలు.. కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ…
కాంగ్రెస్ నాయకత్వాన్ని కుదిపేసిన జీ-23లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్... పార్టీలో సంస్కరణల గురించి ఇటీవల ప్రస్తావించారు. వచ్చే నెల జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు శశి థరూర్ సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రాజ్‌పథ్ పేరును కర్తవ్య మార్గంగా మార్చడంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ శనివారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్ని రాజ్భవన్లను కూడా కర్తవ్య భవన్లుగా మార్చకూడదా అని ప్రశ్నించారు.
024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం తన మెగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర పార్టీ పునరుజ్జీవనానికి దోహదపడుతుందని జి-23 నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.