Shashi Tharoor: రాహుల్ గాంధీ అంగీకరించలేదు.. అందుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor Reveals Sensational Secrets: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎంపీ శశిథరూర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఇటీవల ఆయన్ను ఈ పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారని కథనాలు చక్కర్లు కొట్టాయి. వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని శశిథరూర్ తాజాగా స్పష్టం చేశారు. కానీ.. కొందరు సీనియర్లు మాత్రం తనపై కంప్లైంట్ చేశారన్న మరో షాకింగ్ విషయాన్ని ఆయన ఈ సందర్భంగా రివీల్ చేశారు. అధ్యక్ష పదవికి తాను సరితూగనని, నామినేషన్‌ను ఉపసింహరించుకునేలా తనని విజ్ఞప్తి చేయాల్సిందిగా రాహుల్ గాంధీని కొందరు సీనియర్ నేతలు కోరారని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే తనతో చెప్పారని శశి థరూర్ పేర్కొన్నారు.
‘‘ఇటీవల రాహుల్ గాంధీతో సంబాషణ జరిపినప్పుడు.. నన్ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని రాహుల్‌ని కొందరు సీనియర్లు కోరారట. కానీ, రాహుల్ మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకీ మేలు జరుగుతుందని తాను భావిస్తున్నట్టు.. రాహుల్ వారికి వివరించారని చెప్పారు. పైగా.. పార్టీ అధినేత పదవికి పోటీ చేయాలని పదేళ్ల నుంచి చెప్తున్నానంటూ.. ఆయనకు నాకు గుర్తు చేశారు’’ అని శశిథరూర్ తెలిపారు. తన మద్దతుదారులలో ఎక్కువ మంది యువ నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న థరూర్.. సీనియర్లు నాకు మద్దతు ఇస్తారని ఏనాడూ అనుకోలేదని బాంబ్ పేల్చారు. అయితే యువతతో పాటు అన్ని వయస్కుల నుంచి తనకు మద్దతు అవసరమని, అందుకే ఏ ఒక్కరినీ తగ్గించి మాట్లాడనని థరూర్ అన్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇదిలావుండగా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 17న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. సుమారు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం.. మార్పు నినాదంతో శశిథరూర్ ప్రచారం నిర్వహిస్తుండగా, దళిత మార్క్‌తో మలికార్జున ఖర్గే బరిలో దిగుతున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!