గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. శాంతి సదస్సుకు రావాలని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు, ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. కానీ మోడీ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
చెతేశ్వర్ పుజారా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉండటం మరియు సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల పుజారా 103 టెస్ట్ మ్యాచ్లు, 5 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పుజారా చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (2023)లో భారత్ తరపున ఆడాడు. చెతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత, కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ఎంపీ శశి…
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్కు మార్చ్ చేపట్టింది. విపక్ష ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు.
Shashi Tharoor: భారతదేశంపై 25 శాతం సుంకాలను విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థ’’గా అభివర్ణించాడు. అయితే, ట్రంప్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సమర్థించాడు. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అని రాహుల్ గాంధీ చెప్పడంపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు విభేదిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్…
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని…
ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈలోపే ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ముగించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Shashi Tharoor: తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. క్రమక్రమంగా పార్టీకి థరూర్కి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని అన్నారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అనే అంశంపై కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. మొదట ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది.
Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన.
Mallikarjun Kharge: శశిథరూర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు. ఆయనను పార్టీలో ఉంచుకోలేక, బయటకు పంపించలేక హస్తం పార్టీ సతమతం అవుతోంది. మరోవైపు, థరూర్ ప్రధాని నరేంద్రమోడీని, మోడీ నాయకత్వాన్ని ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రపంచ దేశాలు పర్యటించిన దౌత్యబృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.