137 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించడం ఇది ఆరోసారి. 24 సంవత్సరాల అనంతరం తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య గట్టి పోటీ నెలకొననున్న సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో బళ్లారిలో రాహుల్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశథరూర్‌కు మధ్య గట్టి పోటీ జరగనుంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఖర్గేకు అధిష్ఠానంతో పాటు సోనియా సపోర్టు ఉందని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఆయన పేరును స్వయంగా సోనియానే సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికల పోటీలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు ఇద్దరే ఉన్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేశారు.. పార్టీలో మేమందరం ఒక్కటేనని, తమకు సిద్ధాంత వైరుధ్యాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే తమ చర్చ అన్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఫ్యామిలీలో అంతర్గత చర్చ జరుగుతోందన్నారు. హైదరబాద్‌లో కొందరిని…