కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీలో బరిలో దిగాలని శశిథరూర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళయాళ దిన పత్రిక "మాతృభూమి"లో ఆయన ఇటీవలే ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల జరగాలని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం షెవాలియర్ డి లా లెజియన్ డి'హోన్నూర్‌ను ఆ దేశం ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కడంపై పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.అతని రచనలు, ప్రసంగాలకు ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరిస్తోంది.
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ విచారణపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంపీలపై అనుచితంగా వ్యవహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంపీలని చూడకుండా లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడుకు చెందిన ఎంపీ జోతిమణి, ఢిల్లీ…
ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తనదైన రీతిలో చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తోంది. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆమె కొంతమంది లా విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చేనేతకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చర్చించారు. ఇక పూనమ్ కౌర్ తో పాటు పలువురు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందంటూ శశి థరూర్ భేటీకి సంబంధించిన కొన్ని ఫోటోలను…
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.. ఏది మాట్లాడిన అందులో లాజిక్ ఉంటుంది.. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు, సెటైర్లు వేసే ఆయన.. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ శక్తిమంతమైన, డైనమిక్ లీడర్ అంటూ కితాబిచ్చారు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయంలో మోడీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్న అన్నారు శశిథరూర్.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022లో పాల్గొనేందుకు జైపూర్ వెళ్లిన…
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దొంగ ఒక పార్టీని లీడ్ చేస్తున్నారని, టీపీసీసీ ‘చీప్ ‘ రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ…
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది.. ఆయన దివంగత భార్య సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అభియోగాలను తోసిపుచ్చిన ఢిల్లీలోని సెషన్స్ కోర్టు.. ఇవాళ ఆయనకు నిర్ధోషిగా ప్రకటించింది… కాగా, సునంద పుష్కర్ 2014 జనవరిలో ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. ఆమె డ్రగ్స్ వాడినట్టు వైద్యుల నివేదిక సూచించింది. ప్రాథమిక విచారణలో ఇది హత్యా? కాదా ? అనే కోణంలో…