Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge To Sworn Oath As AICC President On October 26: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే.. రేపు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఏఐసీసీ ప్రాంగణంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత – మాజీ సీడబ్ల్యూసీ సభ్యులు, ప్రస్తుత – మాజీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ప్రస్తుత – మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత – మాజీ పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత – మాజీ సీఎల్‌పీ లీడర్లు హాజరు కానున్నారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో కీలక భాగస్వాములైన ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్ల( పిఆర్ఓ)లతో పాటు అసిస్టెంట్ ఏపీఆర్ఓలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానం అందుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ చేసిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు.. ఏఐసీసీ సెంట్రల్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ, మల్లికార్జున్ ఖర్గేకు సర్టిఫికెట్‌ను అందజేయనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో ఖర్గే తొలిసారిగా తొలిసారిగా పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే.. అనారోగ్య రీత్యా మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది.
Also Read
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
కాగా.. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ పోటీ పడిన సంగతి తెలిసిందే! అక్టోబరు 17వ తేదీన ఎన్నికలు నిర్వహించగా.. బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 9500 ఓట్లు పోలవ్వగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్‌కు 1072 ఓట్లు పడ్డాయి. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. గాంధీ కుటుంబంతో పాటు సీనియర్లందరూ ఖర్గేకు మద్దతుగా ఉండటంతో.. ఆయన భారీ మెజారిటీ దక్కింది.
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!