Mallikarjun Kharge: శశిథరూర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు. ఆయనను పార్టీలో ఉంచుకోలేక, బయటకు పంపించలేక హస్తం పార్టీ సతమతం అవుతోంది. మరోవైపు, థరూర్ ప్రధాని నరేంద్రమోడీని, మోడీ నాయకత్వాన్ని ప్రశంసించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రపంచ దేశాలు పర్యటించిన దౌత్యబృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్‌పై ఎఫెక్ట్! ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర…
Shashi Tharoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అవ్వడం, ఆయనకు లంచ్ ఆతిథ్యం ఇవ్వడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉగ్రవాద దాడి వెనక అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని, దాదాపు 3000 మందిని చంపిన అతను పాకిస్తాన్ లోని అబోటాబాద్ ఆర్మీ క్యాంప్ సమీపం దాక్కున్న విషయాన్ని థరూర్…
ఎంపీ శశి థరూర్‌కు సొంత పార్టీ కాంగ్రెస్‌తో విభేధాలు ఉన్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల.. అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వం శశి థరూర్‌ను నాయకుడిగా నియమించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ శశి థరూర్ పేరును ప్రతిపాదించలేదు.
Shashi Tharoor: పాకిస్తాన్ తీరును మరోసారి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి విదేశాలకు వివరించే భారత దౌత్య బృందానికి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌతో సమావేశమైంది.
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ దౌత్య ప్రచారంలో, వాషింగ్టన్ డిసిలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, వాషింగ్టన్ పోస్ట్‌లో పనిచేస్తున్న తన కుమారుడు ఇషాన్ థరూర్ ప్రశ్నలు అడిగాడు. వాషింగ్టన్ పోస్ట్ గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్ ఇషాన్ థరూర్ ఒక ప్రశ్న అడగడానికి లేచి నిలబడగా, థరూర్ నవ్వుతూ, “దీన్ని అనుమతించకూడదు. ఇతను నా కొడుకు”…
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర విభేదాలకు కారణమవుతోంది. శశిథరూర్ తీరుపై హస్తం పార్టీ ఆగ్రహంతో ఉంది. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా,
పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం! పాకిస్తాన్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. గత చాలా సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపిందన్నారు. ఉగ్రవాద దేశం వల్ల మేము చాలా…
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఎంపీ శశిథరూర్ భారత కాన్సులేట్‌లో చెప్పుకొచ్చారు. పహల్గాంలో మతం ఆధారంగా టూరిస్టులపై ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు.
హస్తం పార్టీకి శశిథరూర్ తలనొప్పిగా మారారు. కాంగ్రెస్‌లో ఉంటూ ప్రత్యర్థి పార్టీ బీజేపీని ప్రశంసిస్తున్నారు. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఏడు బృందాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు బాధ్యతలు అప్పగించారు.