Shashi Tharoor: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హస్తం పార్టీకి రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం థరూర్ ‘‘లక్ష్మణ రేఖ’’ దాటారని భావిస్తున్నారు. అయితే, దీనిపై శశి థరూర్ స్పందించారు. ‘‘భారతీయుడిగా గర్వించదగిన పౌరుడిగా ఈ వ్యాఖ్యలు చేశాను’’ అని స్పష్టం చేశారు.
Shashi Tharoor : ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై అంగీకారం ప్రకటించిన కొన్ని గంటలకే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనదైన శైలిలో స్పందించారు. శనివారం రాత్రి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హిందీలో ఓ ద్విపదను పోస్ట్ చేసిన ఆయన, “ఉస్కీ ఫిత్రత్ హై ముకర్ జానే కీ, ఉస్కే వాదే పే యకీన్ కైసే కరూ?” అంటూ వ్యంగ్యంగా విసిరారు. దీని అర్థం: “మాట తప్పడం వారి నైజం, వారి వాగ్దానాలను…
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేరళలో శుక్రవారం ఇండియా బ్లాక్‌ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వేదికపై ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఉండగానే, ఇండీ కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తిరువనంతపురంలో విజింజం అంతర్జాతీయ ఓడరేవు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన పక్కన నిలబడడంతో కొంత మందికి నిద్ర పట్టదని హస్తం పార్టీపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేరళలో విజింజం అంతర్జాతీయ ఓడరేవును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారింది. ఇటీవల పలు సందర్భాల్లో శశి థరూర్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై కఠినంగా మాట్లాడారు. దీనికి తోడు కేరళలో సీపీఎం ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానంపై ప్రశంసలు కురిపించారు. గతంలో, పార్టీ తనను పట్టించుకోకుంటే, తనకు వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో త్వరలోనే థరూర్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. Read Also: Deputy CM Pawan Kalyan:…
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి.
Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీ దౌత్య విధానాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్నాళ్లు మోడీ దౌత్య వైఖరిని తప్పుబడుతూ మూర్ఖంగా(ఎగ్ ఆన్ ఫేస్) వ్యవహరించానంటూ కామెంట్స్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని కొనియాడారు. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తుండగా, సొంత పార్టీ కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉంది.
శశిథరూర్.. కాంగ్రెస్ ఎంపీ. కానీ పొగడ్తలు మాత్రం కేంద్రంపై ఉంటాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఒక్క కామెంట్ ఉంటుంది. తరచుగా ప్రధాని మోడీని, కేంద్ర పెద్దలను ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో ఆయన కాంగ్రెస్ వీడనున్నట్లు వార్తలు వినిపించాయి.
DK Shivakumar: కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది. హస్తం పార్టీలో ఎంపీ శశిథరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు కలకలం రేపుతున్నారు. వీరిద్దరు బీజేపీకి దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇషాఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు నిర్వహించిన మహాశివరాత్రి కార్యక్రమానికి డీకే శివకుమార్ వెళ్లడంపై సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు ఈయన ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లడం కూడా వివాదాస్పదమైంది.
Shashi Tharoor: కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ వ్యవహారం ఆ పార్టీలో కాకరేపుతోంది. రేపోమాపో ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీకి థరూర్ సిగ్నల్స్ పంపుతున్నారు. తాజాగా, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ దిగడం కాంగ్రెస్‌కి స్పష్టమైన మెసేజ్‌ని పంపింది.