Congress: ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నావ్ సరే.. ముందు ఏ పార్టీలో ఉన్నావో చెప్పు శశిథరూర్!
- కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా తన వైపే చూస్తున్నారు: శశిథరూర్
- ఎంపీ శశిథరూర్ మొదట ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించిన కేరళ కాంగ్రెస్ పార్టీ నేతలు
- 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే మా టార్గెట్: కేరళ కాంగ్రెస్ నేత కె.మురళీధరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్‌సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. మొదట ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక, సర్వేల్లో ఎవరో ఒకరు మొదటి వరుసలో ఉంటారు.. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే, దానికి చెందిన వ్యక్తే చీఫ్ మినిస్టర్ అవుతారు.. మా అసలు టార్గెట్ ఎన్నికల్లో విజయం సాధించడమే.. శశిథరూర్ అనవసర వివాదాలు సృష్టించొద్దు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.మురళీధరన్ స్పష్టం చేశారు.
Read Also: Shakib Al Hasan: సొంత దేశం పొమ్మంది.. పొరుగు దేశంలో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్..!
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇక, ఎంపీ శశిథరూర్‌కు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. పార్టీ నేతలకు, ఆయనకు మధ్య వరుసగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే, సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ శశిథరూర్ ఓ వ్యాసం రాశారు. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. కొందరికి మోడీనే ప్రాధాన్యమంటూ మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా థరూర్ ఓ పక్షి ఫొటోను షేర్ చేసి.. ఎగరడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. రెక్కలు నీయి.. ఆకాశం ఎవరి సొంతం కాదు అనే సందేశాన్ని రాసుకొచ్చాడు. శశిథరూర్ మెసేజ్ పై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. ఎగరడానికి పర్మిషన్ అడగొద్దు.. కానీ, ఈ రోజుల్లో స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని నిశితంగా గమనించాలి.. ఆ పక్షులను ఎల్లప్పుడూ గద్దలు, రాబందులు వేటాడుతూనే ఉంటాయని సూచించారు.
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!